Johnny Master Remuneration: ప్రస్తుతం ఇండియా లో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ లిస్ట్ తీస్తే అందులో జానీ మాస్టర్(Jani master) పేరు నెంబర్ 1 స్థానం లో ఉంటుంది. టాలీవుడ్ తో మొదలైన ఆయన సినీ ప్రస్థానం, ఆ తర్వాత కొలీవూడ్, శాండిల్ వుడ్ కి చేరింది. ఇక ఎప్పుడైతే బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడో జానీ మాస్టర్ నేటి తరానికి ప్రభు దేవా లెక్క మారిపోయాడు. ఆయన కొరియోగ్రఫీ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. కానీ శ్రేష్టి వర్మ అనే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులు చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం, దాంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ లో మూడు నెలల వరకు ఉంచి విచారించడం జరిగిని. ఆ తర్వాత బెయిల్ మీద విడుదలైన జానీ మాస్టర్ రీ ఎంట్రీ ఇచ్చాక జానీ మాస్టర్ కి కెరీర్ చాలా కష్టం అయిపోతుందని అంతా అనుకున్నారు.
కానీ కెరీర్ ప్రారంభం లో రామ్ చరణ్(Global Star Ram Charan) ఎలా అయితే జానీ మాస్టర్ కి అవకాశాలు ఇచ్చి టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ అవ్వడానికి కారణం అయ్యాడో, రీ ఎంట్రీ తర్వాత కూడా రామ్ చరణ్ ‘పెద్ది'(Peddi Movie ) చిత్రం తో జానీ మాస్టర్ కి కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ జానీ మాస్టర్ రామ్ చరణ్ చేత అద్భుతమైన స్టెప్పులు వేయించాడు. రీసెంట్ గా విడుదలైన ‘చికిరి..చికిరి’ వీడియో సాంగ్ అందుకు ఒక ఉదాహరణ. ఈ పాటలోని రామ్ చరణ్ స్టెప్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాగా వైరల్ అయ్యాయి. ఇన్ స్టాగ్రామ్ లో లక్షల సంఖ్యలో రీల్స్ పడుతున్నాయి. కేవలం పది రోజుల్లో జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు ఇంత వైరల్ అవ్వడం తో మరోసారి ఆయనకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. రీసెంట్ గానే పెద్ది చిత్రం లో మరో పాటకు కూడా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసాడు.
జానీ మాస్టర్ పని తీరుని ఎంతో నచ్చిన రామ్ చరణ్, నిర్మాతతో మాట్లాడి 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇప్పించినట్టు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇదే కనుక నిజమైతే జానీ మాస్టర్ టైం మళ్లీ మొదలైనట్టే. ఇప్పటికే ఆయన నాలుగు పెద్ద సినిమాలకు కొరియోగ్రఫీ చేయడానికి సంతకాలు కూడా చేసాడట. అంతే కాకుండా రెండు హిందీ ప్రాజెక్ట్స్ కూడా సిద్ధం గా ఉన్నాయని టాక్. చూడాలి మరి పెద్ది తర్వాత జానీ మాస్టర్ కెరీర్ ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది.