Site icon OkTelugu

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్ కామెంట్స్..

Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా ‘శ్రీనివాస మంగపురం’ చిత్రం తో ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రొమోషన్స్ లో జయకృష్ణ చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయనతో పాటు హీరోయిన్ రషా టాండన్ , డైరెక్టర్ అజయ్ భూపతి కూడా ప్రొమోషన్స్ లో పాలు పంచుకుంటున్నారు. అయితే రీసెంట్ గా జయకృష్ణ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. వాటి విశేషాలేంటో ఒకసారి చూద్దాం.

ముందుగా యాంకర్ జయకృష్ణ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ బాబాయ్ మహేష్ బాబు కాకుండా, బయట హీరోల్లో మీకు నచ్చే హీరో ఎవరు?’ అని అడిగిన ప్రశ్నకు జయకృష్ణ క్షణం కూడా ఆలోచించకుండా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు చెప్తారు. ఆయన మాట్లాడుతూ ‘రామ్ చరణ్ గారంటే నాకు చాలా ఇష్టం. ఒక స్టార్ కంటే ముందు , ఆయన ఒక గొప్ప పెరఫార్మర్ , ఒక స్టార్ కి కావాల్సిన లక్షణం అదే. ఆయన నుండి చాలా నేర్చుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక రీసెంట్ గా విడుదలైన ‘పెద్ది’ చిత్రాన్ని చూశారా అని జయకృష్ణ ని అడాగ్గ్గా ‘చూశాను.. చాలా అద్భుతంగా చేశారు’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా గర్వం గా ఈ వీడియో ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తున్నారు.

ఇక ‘శ్రీనివాస మంగపురం’ చిత్రం విషయానికి వస్తే , ఈ సినిమాకు RX 100, మంగళవారం వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయగా, దానికి కూడా అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇందులో సీనియర్ లెజండరీ హీరో మంచు మోహన్ బాబు ఒక కీలక పాత్ర పోషించారు. ట్రైలర్ లో ఆయన పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఓవరాల్ గా ప్రామిసింగ్ సినిమా అనిపిస్తోంది , మరి ఆడియన్స్ నుండి ఎలాంటి రియాక్షన్స్ రాబోతున్నాయి తెలుసుకోవాలంటే జులై 30 వరకు ఆగాల్సిందే.

Exit mobile version