Jawan: సెప్టెంబర్ 8న రిలీజ్ అయిన షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా ఈ చిత్రానికి మొదటిరోజు మంచి వసూలు వచ్చాయి. ఇక షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది అని సినీ ప్రేక్షకులు అంచనాలు వేశారు.
కాగా ఈ సినిమా ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో ఏమో తెలియదు కానీ మొత్తానికి మన ప్రభాస్ బాహుబలి 2 సినిమా రికార్డును మాత్రం అందుకోలేకపోయింది. బాహుబలి రెండు సినిమాలు దేశమంతటా ఎంత భారీ విజయాన్ని సాధించాయి అందరికి తెలిసిందే. సినిమా వచ్చి 6 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు బద్దలు కొట్టడానికి చాలా సినిమాలు ట్రై చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు బాహుబలి 2 రికార్డులు బద్దలు కొట్టడానికి తెగ ట్రై చేస్తున్నాయి.
ఇక షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా తప్పకుండా బాహుబలి క్రియేట్ చేసిన ఒక రికార్డును బ్రేక్ చేస్తుంది అని అనుకున్నారు అందరూ. షారుక్ ఖాన్ పతాన్ సినిమా షారుఖ్ పఠాన్ సినిమా హిందీలో అత్యంత ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచి బాహుబలి రికార్డుని బద్దలు కొట్టింది. ఇలా బాహుబలి క్రియేట్ చేసిన మరో రికార్డ్ ని జవాన్ కోడుతుందేమో అనుకున్నారు. అసలు విషయానికి వస్తే ముందు నుంచే అడ్వాస్ బుకింగ్స్ తో రికార్డులు సెట్ చేసి కలెక్షన్స్ తో సరికొత్త రికార్డ్ సెట్ చేయడానికి ఎదురు చూస్తోంది జవాన్.
అయితే ఎంత ప్రయత్నించినా బాహుబలి సెట్ చేసిన ఒక రికార్డును మాత్రం ఈ సినిమా అందుకోలేకపోయింది. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటంటే.. దేశంలోని అన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లో ఎక్కువ టికెట్స్ అమ్మయుడయిన రికార్డ్ ఇప్పటికి కూడా బాహుబలి 2 పేరు మీదే ఉంది. బాహుబలి 2 సినిమా రిలిజ్ కి ముందు దాదాపు 6 లక్షల 50 వేలకు పైగా అడ్వాన్స్ టికెట్స్ అమ్ముడుపోయాయి. ఈ రికార్డుని బద్దలు కొట్టడానికి చాల సినిమాలు ట్రై చేశాయి. బ్లాక్ బస్టర్ సాధించిన KGF 2 సినిమా 5 లక్షల టికెట్లు దాటి దగ్గరికి వచ్చింది. కానీ ఇటీవల షారుఖ్ పఠాన్ సినిమాతో 5 లక్షల 50 వేలు దాటగా తాజాగా జవాన్ సినిమా 5 లక్షల 59 వేల వరకు వచ్చి ఆగిపోయింది. దీంతో ప్రస్తుతం వరకు ఏ సినిమా కానీ మన బాహుబలి రికార్డ్ దగ్గరికి కూడా రాలేకపోయింది. మరి ఈ రికార్డ్ బ్రేక్ చేయడానికి మళ్లీ మన రాజమౌళి తదుపరి సినిమాకే సాధ్యమవుతుందో ఏమో.