Jawan OTT: జవాన్ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ.. ఎన్ని కోట్లకు ఇచ్చారు? ఏ ఓటీటీలో వస్తుందంటే?

‘జవాన్’ రిలీజ్ కు ముందే భారీ అంచనాలు ఉండేవి. అందుకు తగ్గట్లుగానే రిలీజ్ అయిన ఫస్ట్ డే నాడే రూ.239 కోట్లు వసూళ్లు రాబట్టింది. దీంతో ఫస్ట్ రోజే సినిమా పెట్టుబడుల్లో సగం వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు.

Written By: Chai Muchhata, Updated On : September 14, 2023 10:48 am

Jawan OTT

Follow us on

Jawan OTT: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ ఏడాది వసూళ్ల ఫిలిం గా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఈ మూవీ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే తాజాగా ఈ సినిమా దూకుడు తగ్గించినట్లు తెలుస్తోంది. అయినా చాలా థియేటర్లలో ‘జవాన్’ కొనసాగుతుండడంతో మరింత రాబడిపై ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ తరుణంలో ‘జవాన్’ డిజిటల్ హక్కుల పై ఆసక్తి చర్చ సాగుతోంది. జవాన్ ఓటీటీలో ఏ వేదికపై అలరిస్తుందోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వెండితెరపై ప్రభంజనం సృష్టించిన ఇది ఓటీటీలోనూ హవా కొనసాగనుందని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ సంస్థ దక్కించుకుందంటే?

షారుఖ్ ఖాన్ చాలా రోజుల తరువాత మాస్ మూవీ లో నటించాడు. తమిళ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ బాద్ షాను ‘జవాన్’ రూపంలో మరో రేంజ్ లో నిలబెట్టారు. సెప్టెంబర్ 7 న రిలీజ్ అయిన ఈ మూవీలో షారుఖ్ ఖాన్ తో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార నటించారు. విజయ్ సేతుపతి, తదితరులు అలరించారు. షారుఖ్ ఖాన్ ఇందులో వివిధ వేరియంట్లలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ఆయనను చూసిన అభిమానులు మళ్లీ పాత షారుఖ్ ను చూసిన అనుభూతి కలిగిందని ప్రశంసిస్తున్నారు. మరోసారి బాద్ షా తన పనితనం చూపించాడని కొనియాడుతున్నారు.

‘జవాన్’ రిలీజ్ కు ముందే భారీ అంచనాలు ఉండేవి. అందుకు తగ్గట్లుగానే రిలీజ్ అయిన ఫస్ట్ డే నాడే రూ.239 కోట్లు వసూళ్లు రాబట్టింది. దీంతో ఫస్ట్ రోజే సినిమా పెట్టుబడుల్లో సగం వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. ఇక అక్కడి నుంచి డే బై డే కలెక్షన్స్ దూసుకుపోయి రూ.500 కోట్ల మార్క్ దాటింది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో సినిమా హంగామా సృష్టిస్తోందని చెప్పవచ్చు. సినిమాలో కంటెంట్ తో పాటు షారుక్ ఖాన్ నటన చూసేందుకు కొందరు రిపీట్ ఆడియన్స్ ఉంటున్నారని కొందరు సోషల్ మీడియా వేదికగా తమ అనుభవాలను పంచుకుంటున్నారు.

ఇప్పుడున్న రోజుల్లో థియేటర్లలో కాస్త అటూ ఇటూ అయినా ఓటీటీని నమ్ముకుంటున్నారు చాలా మంది నిర్మాతలు. కానీ ‘జవాన్’ వెండితెరపైనే రికార్డులు సృష్టించింది. దీంతో ఓటీటీలోనూ హవా సాగిస్తుందని నమ్మకం పెట్టుకున్నారు. ‘జవాన్’ను షారుఖ్ సొంత బ్యానర్ పై నిర్మించారు. దీంతో ఆయనకు రెండు వైపులా లాభాలు తెచ్చిపెట్టినట్లయింది. ఓ వైపు గుర్తింపు రావడంతో పాటు మరోవైపు భారీ వసూళ్లు తెచ్చిపెట్టిన సినిమాగా రికార్డుల్లోకెక్కింది.

ఇక ‘జవాన్’ ఏ వేదికపై స్ట్రీమింగ్ అవుతుందోనని ఇప్పటి నుంచి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ కు దక్కించుకుంది. ఈ సంస్థ ‘జవాన్’ను రూ.250 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. సాధారణంగా సినిమా రిలీజ్ అయిన 45 నుంచి 60 రోజుల తరువాత ఓటీటీలోకి తీసుకురావాలనే ఒప్పందాన్ని చేసుకున్నారు. దీంతో జవాన్ అక్టోబర్ చివరి వారంలో నెట్ ఫ్లిక్ష్ లోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు వరకు జవాన్ ను చూడాలంటే మాత్రం థియేటర్లోకి వెళ్లాల్సిందే.

‘జవాన్’ మూవీకి రూ.400 కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీ లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఓటీటీలోనూ సక్సెస్ అయితే మరో ఏడాదిపాటు షారుఖ్ కు తిరుగులేదనే చెప్పవచ్చు. కొన్నాళ్లపాటు బాలీవుడ్ లో షేక్ చేసే సినిమాలు కరువయ్యాయి. ఇలాంటి తరుణంలో మారోసారి షారుక్ ‘జవాన్’తో దుమ్ము దులిపేశాడు. అయితే ఇదంతా తమిళ డైరెక్టర్ అట్లీ పుణ్యమనే చెప్పొచ్చు.అయితే బాలీవుడ్ హీరో షారుఖ్ తో ఇండస్ట్రీ మరో సారి మారుమోగిందని అనుకుంటుండగా తమిళ డైరెక్టర్ సినిమా సక్సెస్ అయిందని కోలీవుడ్ ఇండస్ట్రీ సంబరాలు చేసుకుంటున్నారు.