Jawan Collections: షారుఖ్ ఖాన్ నుంచి తాజాగా వచ్చిన చిత్రం జవాన. అతని కమ్ బ్యాక్ సినిమా పఠాన్ ఎంతటి హిట్ అనేది అందరికీ తెలుసు, దానికి మించిన సూపర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ విషయంలో కూడా దానికి మించిన వసూళ్లు సాధిస్తూ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది. ముఖ్యంగా నాలుగో రోజు కేవలం ఇండియా మార్కెట్ లో 81 కోట్ల వసూళ్లు సాధించింది. హిందీ సినిమా హిస్టరీ లో ఒకే రోజు ఎక్కువ కలెక్షన్స్ చేసిన సినిమా గా జవాన్ నిలిచింది. ఇక ఏడో రోజు కూడా మంచి వసూళ్లు సాధించింది ఈ సినిమా.
ఏడో రోజు ఇండియా వైడ్ దాదాపు 23. 5 కోట్ల నెట్ వసూళ్లు చేసింది జవాన్. హిందీ వెర్షన్ 21 కోట్లు, తెలుగు, తమిళ వెర్షన్స్ కలిపి రెండు పైగా వసూళ్లు చేసింది. దీనితో ఓవరాల్ గా ఇండియా లో మొత్తం 387 కోట్ల దాకా నెట్ కలెక్షన్ చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 305 కోట్ల జరిగింది. మొదటి వారమే బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా భారీ లాభాలు దిశగా అడుగులు వేస్తుంది. ఇక గ్రాస్ విషయానికి వస్తే ఇప్పటికే 700 కోట్ల క్లబ్ లోకి చేరింది జవాన్ సినిమా.
ఇక ఈ వీకెండ్ లో ఖచ్చితంగా అదుర్స్ అనిపించే వసూళ్లు రావటం ఖాయం. ముఖ్యంగా తెలుగులో కూడా ఒక టాప్ హీరో సినిమాకు వచ్చిన వసూళ్లు వస్తున్నాయి షారుఖ్ సినిమా కు. దీనిని బట్టి చూస్తుంటే టాలీవుడ్ లో కూడా ఈ బాలీవుడ్ కింగ్ ఖాన్ హవా మొదలైందనే చెప్పవచ్చు. ఇక ఈ వీకెండ్ ముగిసే సరికి దాదాపు 900 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరే అవకాశం లేకపోలేదు. ఇక నెట్ విషయానికి వస్తే 500 కోట్ల మార్క్ టచ్ కావడం ఖాయం.
మరోపక్క ఓవర్శిస్ లో కూడా జవాన్ దూసుకెళ్తుంది. మనకి వస్తున్నా వివరాల ప్రకారం దాదాపు 25 మిలియన్ డాలర్లు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. అక్కడ సినిమాను తీసుకున్న బయ్యర్లకు రూపాయి కి రూపాయి లాభం అనే చెప్పాలి. పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా లో షారుఖ్ ఖాన్ నటన, దర్శకుడి మేకింగ్ స్టైల్ అదుర్స్ అనే చెప్పాలి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అయితే కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోసి మరి నిలబెట్టాడు తన BGM ఉపయోగించి.