Homeఎంటర్టైన్మెంట్Jani Master: స్టేజి మీద భార్య కాళ్ళు మొక్కిన జానీ మాస్టర్.. కన్నీళ్లు రప్పిస్తున్న వీడియో!

Jani Master: స్టేజి మీద భార్య కాళ్ళు మొక్కిన జానీ మాస్టర్.. కన్నీళ్లు రప్పిస్తున్న వీడియో!

Jani Master: దేశం గర్వించదగ్గ డ్యాన్స్ మాస్టర్స్ లో ఒకరు జానీ మాస్టర్. నెల్లూరు జిల్లా నుండి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన, ఒక గ్రూప్ డ్యాన్సర్ గా మొదలై, ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో టాలీవుడ్ లో టాప్ డ్యాన్స్ మాస్టర్ గా ఎదగడమే కాదు, కోలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ ఇలా అన్నీ ఇండస్ట్రీస్ లోనూ టాప్ డ్యాన్స్ మాస్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఒక నేషనల్ అవార్డు ని కూడా సొంతం చేసుకున్నాడు. కానీ గత ఏడాది జరిగిన కొన్ని పరిణామల కారణంగా పీక్ రేంజ్ లో ఉన్న జానీ మాస్టర్, ఒక్కసారిగా పాతాలం లోకి పడిపోయాడు. వచ్చిన నేషనల్ అవార్డు ని కూడా రద్దు చేశారు. ఇక జానీ మాస్టర్ పని అయిపోయింది అని అంతా అనుకున్నారు.

కానీ బయటకు వచ్చిన తర్వాత తనకు కెరీర్ ని ఇచ్చిన రామ్ చరణ్, మరోసారి కెరీర్ పరంగా పునర్జన్మ ని కల్పిస్తూ ‘పెద్ది’ చిత్రంలోని పాటలకు కోరియోగ్రఫీ చేసే అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత ఆయన కంపోజ్ చేసిన ‘చికిరి చికిరి’ పాట గ్లోబల్ వైడ్ గా ఒక ఊపు ఊపడంతో జానీ మాస్టర్ ఈజ్ బ్యాక్ అని అనిపించుకున్నాడు. ఒకప్పుడు జానీ మాస్టర్ టీవీ షోస్ లలో కొన్ని డ్యాన్స్ షోస్ కి జడ్జిగా వ్యవహారించేవాడు. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత బుల్లితెర పై రీ ఎంట్రీ ఇస్తూ ‘ఆట’ డ్యాన్స్ షో ద్వారా జడ్జిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత వారం ఈ షో మొదలైంది. నాగబాబు కూతురు నిహారిక కొణిదెల ఈ షోకి నిర్మాతగా వ్యవహారిస్తోంది. మొదటి రెండు షోస్ కి ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.

ఇకపోతే వచ్చే వారం వాలంటైన్స్ డే స్పెషల్ గా కంటెస్టెంట్స్ లవ్ సాంగ్స్ కి డ్యాన్స్ వేయబోతున్నారు. ఈ షో కి జానీ మాస్టర్ భార్య కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆమెని చూడగానే జానీ మాస్టర్ బాగా ఎమోషనల్ అయ్యాడు. ఆమె కాళ్లకు గజ్జలు తొడిగి, ఆమె కాళ్ళు పట్టుకొని ఏడ్చేస్తాడు జానీ మాస్టర్. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ‘ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఈ పిల్ల నాకు భార్య గా దొరికింది. ఇలాంటి మనిషిని కన్నందుకు నా అత్తా మామలకు ధన్యవాదములు తెలుపుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. జానీ మాస్టర్ అరెస్ట్ అయినప్పుడు ఆయన సతీమణి ఎలాంటి ఒంటరి పోరాటం చేసిందో మనమంతా కళ్ళారా చూశాము. ఇవన్నీ జానీ మాస్టర్ కి ఒక్కసారిగా అలా ఫ్లాష్ అయ్యాయి అంటున్నారు నేటిజెన్స్.

 

Jani Master & Ayesha's Love & Emotional Moment | Aata Promo | Sat & Sun @ 9PM | Zee Telugu

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Oktelugu Epaper
Exit mobile version