Sridevi Janvi Kapoor: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి అతిలోక సుందరి ఎవరు అంటే మన అందరికి గుర్తుకు వచ్చే పేరు శ్రీదేవి.. అందంలోకానీ, నటనలోకాని ఈమెని మించిన హీరోయిన్ ఇప్పటివరకు ఇండస్ట్రీలో రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు.. బాలనటిగా ఎన్నో సినిమాలలో నటించిన శ్రీదేవి..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి స్టార్ హీరోతో కలిసి నటించి ఎన్నో సెన్షేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని దక్కించుకుంది.

టాలీవుడ్, కోలీవుడ్ , బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండీస్ట్రీలలో ఒక వెలుగు వెలిగిన శ్రీదేవి 2018వ సంవత్సరంలో బాత్ రూమ్ లో కాలు జారి కిందపడి చనిపోయిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. శ్రీదేవికి తన పెద్ద కూతురు జాన్వీ కపూర్ ని పెద్ద స్టార్ హీరోయిన్ గా చూడాలనేది ఆమె కోరిక. కానీ ఆమె హీరోయిన్ అయ్యేలోపు శ్రీదేవి కన్నుమూయడం బాధాకరం.
కానీ శ్రీదేవి ఇప్పుడు మనతో లేకపోయినా..ఆమె కోరికని నెరవేర్చింది జాన్వీ కపూర్..ఆమె హీరోయిన్ గా ఇప్పుడు బాలీవుడ్ లో ఒక రేంజ్ క్రేజ్ ని సంపాదించింది.. ఇక సోషల్ మీడియాలో ఈమెకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..యూత్ జాన్వీ కపూర్ అంటే మెంటలెక్కిపోతారు..అలాంటి క్రేజ్ ని సంపాదించింది.. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిల్లి’ నవంబర్ 4 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వడానికి సిద్ధం అవుతుంది..2019వ సంవత్సరం లో మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా ‘హెలెన్’ అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది..ఈ సినిమా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్ర ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది జాన్వీ కపూర్.
ఈ సందర్భంగా తన తల్లి చివరి కోరికల్లో మిగిలి ఉన్న ఒక కోరిక గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యింది..ఆమె మాట్లాడుతూ ‘నేను పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలనేది అమ్మ కోరిక..అది తీర్చాను..ఇంకో కోరిక మిగిలి ఉంది..అమ్మగారికి బాలీవుడ్ దర్శకురాలు గౌరీ షిండే డైరెక్షన్లో నేను నటిస్తే బాగుంటుంది అని మొదటి నుండి నాకు చెప్తూ వచ్చేది..త్వరలోనే ఆమె కోరిక తీర్చబోతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.ఇలా తల్లి చివరి కోరిక తీరుస్తూ ఏమోషనల్ అయ్యింది జాన్వీకపూర్.