https://oktelugu.com/

James Cameron : జేమ్స్ కామెరూన్ ఆ సినిమాను తన ఫ్రెండ్ కి డెడికేట్ చేయబోతున్నాడా..?

ఇక ఇప్పటివరకు ప్రపంచంలోనే ఏ సినిమా కలెక్ట్ చేయని వసూళ్లను ఈ సినిమా కలెక్ట్ చేసేలా, అసలు ప్రేక్షకుడు ఇంతవరకు చూడని ఒక మెస్మరైజింగ్ విజువల్ వండర్ ను తీయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ సినిమాని ఎన్నో వ్యయ ప్రయాసాలను తట్టుకొని మరి చేస్తున్నాడట. ఇక ఆయన ఫ్రెండ్ మరణంతో ఈ సినిమాని భారీ రేంజ్ లో తీసి ఆయనకు డెడికేట్ చేయాలని చూసున్నాడట.

Written By:
  • Gopi
  • , Updated On : July 8, 2024 / 08:17 PM IST

    producer of James Cameron's Avatar 3 movie

    Follow us on

    James Cameron : హాలీవుడ్ ఇండస్ట్రీలో జేమ్స్ కామెరూన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన తీసిన టైటానిక్, అవతార్ లాంటి సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా కలెక్షన్ల వర్షాన్ని కురిపించాయి. ఇక ఇదిలా ఉంటే ఆయన ప్రస్తుతం అవతార్ 3 సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఇలాంటి సమయంలోనే ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన ‘జాన్ లౌండా’ రీసెంట్ గా మరణించిన విషయం మనకు తెలిసిందే.

    అయితే ఈయన మరణం పట్ల జేమ్స్ కామెరూన్ చాలా డిప్రెషన్ లో ఉన్నాడట. ఎందుకంటే కామెరూన్ ఆయనకి మధ్య మంచి అటాచ్ మెంట్ ఉండేదట. ఇక ఆయన ప్రొడ్యూసర్ మాత్రమే కాకుండా తనకు ఒక ఫ్రెండ్ లాగా భావించేవాడు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది కెమెరూన్ కి కొంతవరకు మైనస్ అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఎలాగైనా సరే అవతార్ 3 సినిమాని తెరకెక్కించి తనకి ఈ సినిమాని డెడికేట్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఆయన ఈ సినిమాని చాలా ప్రస్టేజీయస్ గా కూడా తీయబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇప్పటివరకు ప్రపంచంలోనే ఏ సినిమా కలెక్ట్ చేయని వసూళ్లను ఈ సినిమా కలెక్ట్ చేసేలా, అసలు ప్రేక్షకుడు ఇంతవరకు చూడని ఒక మెస్మరైజింగ్ విజువల్ వండర్ ను తీయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ సినిమాని ఎన్నో వ్యయ ప్రయాసాలను తట్టుకొని మరి చేస్తున్నాడట. ఇక ఆయన ఫ్రెండ్ మరణంతో ఈ సినిమాని భారీ రేంజ్ లో తీసి ఆయనకు డెడికేట్ చేయాలని చూసున్నాడట.

    కాబట్టి ఈ సినిమా మీద ఆయన పెట్టాల్సిన బాధ్యత ఇంకా పెరిగిందని రీసెంట్ గా కెమెరూన్ తెలియజేసినట్టుగా హాలీవుడ్ మీడియాలో కొన్ని కథనాలైతే వెలువడ్డాయి…ఇక మొత్తానికైతే జేమ్స్ కెమెరూన్ మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు…అలాగే తన ఫ్రెండ్ ఈ లోకం లో లేకపోయిన ఆయన ఎక్కడున్నా కూడా గర్వపడేలా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడని తెలుస్తుంది…