Jailer Collections: హీరో రజినీకాంత్ మూవీ సెకండ్ వీక్ లో కూడా సత్తా చాటుతుంది. కొంచెం నెమ్మదించినప్పటికీ రీజనబుల్ వసూళ్లు రాబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే జైలర్ భారీ లాభాలు పంచింది. నైజాం హక్కులు కేవలం రూ. 4.5 కోట్లకు కొన్నారు. రూ. 16 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఏపీ/తెలంగాణాలలో జైలర్ రూ. 30 కోట్ల షేర్ కి పైగా వసూలు చేసింది. ఈ చిత్ర హక్కులను రూ. 12 కోట్లకు కొన్నారు.తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ జైలర్ మూవీతో పెద్ద మొత్తంలో ఆర్జించారు. ముఖ్యంగా దిల్ రాజు శాకుంతలం దెబ్బ నుండి కోలుకోవడానికి జైలర్ సహాయపడింది.
ఇక జైలర్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే… ఫస్ట్ వీక్ రూ. 450 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సెకండ్ వీక్ మొదలయ్యాక మొదటి రోజు రూ. 19. 37 కోట్లు, సెకండ్ డే రూ.17.22 కోట్లు వసూలు చేసింది. టోటల్ రూ.487 కోట్ల వసూళ్లు జైలర్ మూవీ సాధించింది. మ్యాజిక్ ఫిగర్ రూ. 500 కోట్లకు చేరువలో ఉంది. రెండు రోజుల్లో జైలర్ ఈ మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
తమిళనాడులో ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతుంది. రెండో వారం కూడా హౌస్ఫుల్ బోర్డ్స్, ఎక్స్ట్రా షోలు పడుతున్నాయి. రజినీకాంత్ కెరీర్లో మరొక భారీ హిట్ నమోదైంది. ఈ హిట్ చాలా స్పెషల్ అని చెప్పాలి. కారణం… రజినీ ఈ స్థాయి వసూళ్లు సాధించి చాలా కాలం అవుతుంది. కొన్నాళ్లుగా ఆయన సినిమాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. దీంతో విజయ్ నంబర్ వన్ హీరోగా అవతరించాడు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రజినీకాంత్ సినిమా ఆడి చాలా కాలం అవుతుంది. 2.0 తర్వాత తెలుగులో ఆయనకు హిట్ లేదు. జైలర్ మరోసారి తెలుగు ఆడియన్స్ రజినీకాంత్ కోసం థియేటర్స్ కి వచ్చేలా చేసింది. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న జైలర్ ఊహించని విధంగా పుంజుకుంది. పోటీగా విడుదలైన భోళా శంకర్ నిరాశ పరచడం జైలర్ కి ప్లస్ అయ్యింది. జైలర్ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. తమన్నా, రమ్యకృష్ణ, సునీల్ కీలక రోల్స్ చేశారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ లో అలరించారు.