Jailer Collections: జైలర్ మూవీతో రజినీకాంత్ బెంచ్ మార్క్ సెట్ చేశాడు. రూ. 500 కోట్ల మార్క్ దాటేశాడు. ఈ ఫీట్ సాధించిన అరుదైన చిత్రాల్లో జైలర్ ఒకటిగా నిలిచింది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న జైలర్ వసూళ్ల వరదపారించింది. జైలర్ బయ్యర్లకు పెద్ద మొత్తంలో లాభాలు పంచింది. ఒక్క నైజాంలోనే జైలర్ రూ. 14 కోట్లకు పైగా లాభాలు పంచింది. నైజాం హక్కులు కేవలం రూ. 4.5 కోట్లకు అమ్మారు. రూ. 24.5 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.
వరల్డ్ వైడ్ జైలర్ రూ. 122 కోట్ల బిజినెస్ చేసింది. బిజినెస్ కి రెండు రెట్లు లాభాలు తెచ్చిపెట్టింది. అయితే జైలర్ 14వ రోజు వసూళ్ళు నెమ్మదించాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జైలర్ కి రెస్పాన్స్ తగ్గింది. జైలర్ బుధవారం రూ. 60 లక్షల షేర్ వసూలు చేసింది. అలాగే వరల్డ్ వైడ్ రూ. 3.80 కోట్ల షేర్ అందుకుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా జైలర్ రూ. 262 కోట్ల షేర్ వసూలు చేసింది. అంటే రూ. 140 కోట్లకు పైగా లాభాలు జైలర్ మూవీ దక్కించుకుంది.
జైలర్ మూవీలో గొప్ప స్టోరీ ఏం లేదు. రజినీకాంత్ ప్రెజెన్స్, అనిరుధ్ మ్యూజిక్, యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. మొత్తంగా జైలర్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. రిపీటెడ్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూస్తున్నారు. రజినీకాంత్ రిటైర్డ్ జైలర్ రోల్ చేశారు. ఆయన క్యారెక్టరైజేషన్ నెల్సన్ భిన్నంగా రూపొందించారు.
జైలర్ మూవీని సన్ పిక్చర్స్ నిర్మించింది. తమన్నా కీలక రోల్ చేసింది. రమ్యకృష్ణ రజినీకాంత్ భార్య రోల్ చేశారు. సునీల్ మరో కీలక రోల్ చేయడం జరిగింది. చాలా కాలం తర్వాత రజినీకాంత్ క్లీన్ హిట్ అందుకున్నాడు. 2.0 తర్వాత రజినీకాంత్ కి ఆయన రేంజ్ హిట్ పడలేదు. రజినీకాంత్ కి హిట్ పడితే బాక్సాఫీస్ ఊచకోత ఏ రేంజ్ లో ఉంటుందో మరోసారి రుజువైంది. రజినీకాంత్ ఫ్యాన్స్ జైలర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.