Jailer 2: కోలీవుడ్ ఆడియన్స్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి ‘జైలర్ 2′(Jailer2 movie ). 2023 వ సంవత్సరం లో నెల్సన్ దిలీప్ కుమార్ , సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) కాంబినేషన్ లో వచ్చిన ‘జైలర్’ చిత్రం ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వరుస ఫ్లాప్స్ లో రజినీకాంత్ కి ఈ సినిమా సరికొత్త ఊపిరి ని ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించి, నేటి తరం ఆడియన్స్ కి రజినీకాంత్ పవర్ ఏంటో మరోసారి అర్థం అయ్యేలా చేసింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా నెల్సన్ దిలీప్ కుమార్ ‘జైలర్ 2’ ని మొదలు పెట్టాడు. ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించిన రోజు నుండే మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే నేడు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసినట్టు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా రజినీకాంత్ తో మూవీ టీం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చెయ్యగా , అది బాగా వైరల్ అయ్యింది. నిన్న గాక మొన్న మొదలైనట్టుగా అనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ అప్పుడే పూర్తి చేసుకోవడాన్ని చూసి , మన తెలుగు ఆడియన్స్ మన స్టార్ హీరోలను తిట్టడం మొదలు పెట్టారు. 75 ఏళ్ళ వయస్సు లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎండా , వాన అని తేడా లేకుండా షూటింగ్ లో పాల్గొని సినిమా చేసి మన ముందుకు వస్తుంటే, నేటి తరం స్టార్ హీరోలు మాత్రం బద్ధకం తో ఒక్కో సినిమా పూర్తి చేయడానికి ఏళ్ళ తరబడి సమయం తీసుకుంటున్నారు , ఇలా చేస్తే మన సినీ ఇండస్ట్రీ బ్రతకదు , థియేటర్స్ మూత పడుతాయి అంటూ హెచ్చరిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాని ఆగస్టు 14 న విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నారు మేకర్స్. షూటింగ్ తొందరగానే అయిపోయింది కాబట్టి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వచ్చే నెలాఖరు లోపు ఒకవేళ పూర్తి అయితే ఈ సినిమాని జూన్ 24 న విడుదల చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మేకర్స్. అయితే అదే రోజున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం కూడా విడుదల కాబోతుంది. మరి ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవుతాయా?, ఒకవేళ అయితే ఎవరికీ నష్టం అని అడిగితే, కచ్చితంగా పెద్ది చిత్రానికే ఎక్కువ నష్టం ఉంటుంది. ఎందుకంటే ‘జైలర్ 2’ కి తెలుగు రాష్ట్రాల్లో భారీ రిలీజ్ ఉంటుంది. కానీ ‘పెద్ది’ కి తమిళనాడు లో అలాంటి రిలీజ్ ఉండదు. పైగా ఓవర్సీస్ లో ఆడియన్స్ రజినీకాంత్ సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి , జూన్ 24 న క్లాష్ జరిగితే పెద్ది తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.
Alapparai Kelappurom, Thalaivaru Nerandharam! ⭐ It’s a wrap for #Jailer2 @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/75kLIQBF4w
— Sun Pictures (@sunpictures) April 21, 2026