Jagapathi Babu First Look from Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై రోజురోజుకు అంచనాలు భారీ గా పెరిగిపోతున్నాయి. ‘గేమ్ చేంజర్’ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా మీదనే కోటి ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ కి చాలా కాలం తర్వాత నటనకు మంచి స్కోప్ ఉన్న సబ్జెక్టు దొరికింది, ఇక సినిమా బంపర్ హిట్ అనేది బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత రీసెంట్ గా విడుదలైన ‘చికిరి..చికిరి’ పాట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గ్లోబల్ వైడ్ గా ఎక్కడ చూసినా ఈ పాట మేనియా నే కనిపిస్తోంది. ఆ రేంజ్ లో హిట్ అయ్యింది.
ఒక్క తెలుగు వెర్షన్ నుండే ఈ పాటకు 118 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఏ రేంజ్ హిట్ అనేది. ఇకపోతే కాసేపటి క్రితమే ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ సీనియర్ హీరో జగపతి బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ చిత్రం లో ఆయన ‘అప్పలసూరి’ అనే క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు అట. అయితే ఆయన లుక్ ఎవ్వరూ గుర్తుపట్టలేని రేంజ్ లో ఉంది. అసలు ఇందులో కనిపిస్తున్నది నిజంగా జగపతి బాబు యేనా?, లేదా మేకర్స్ పొరపాటున వేరే ఆర్టిస్ట్ ఫోటో విడుదల చేశారా అనే ఆలోచన వచ్చింది నెటిజెన్స్ కి. జగపతి బాబు అని పరిచయం చేశారు కాబట్టి సరిపోయింది, అలా కాకుండా, ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఎవరు అని అడిగితే, అసలు గుర్తు పెట్టేవాళ్ళు కాదేమో, ఆ రేంజ్ మేక్ ఓవర్ లో జగపతి బాబు ని చూపించాడు బుచ్చి బాబు.
గతం లో జగపతి బాబు ‘రంగస్థలం’ చిత్రం లో రామ్ చరణ్ తో కలిసి నటించాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కలయిక లో ఎలాంటి సినిమా రాలేదు. నేరుగా ‘పెద్ది’ తోనే వీళ్లిద్దరు మరోసారి వెండితెర పై సందడి చేయబోతున్నారు. చూడాలి మరి ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ కాంబినేషన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది అనేది. రంగస్థలం చిత్రం లో ప్రెసిడెంట్ క్యారక్టర్ లో భయంకరమైన విలనిజం పండించిన జగపతి బాబు, ‘పెద్ది’ చిత్రం లో రామ్ చరణ్ కి తండ్రి క్యారక్టర్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. సినిమాలో ఈయన జగపతి బాబు అని గుర్తుపట్టడం ఆడియన్స్ పెద్ద పరీక్షే.
The incredible @IamJagguBhai Sir as ‘APPALASOORI’ from #Peddi ❤
Brace yourselves for his masterclass performance in a strong, impactful role
#PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026.
Mega Power Star
@AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana… pic.twitter.com/OStpjwaPtp— BuchiBabuSana (@BuchiBabuSana) December 29, 2025