హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఒక ఐటమ్ సాంగ్ అండ్ నాలుగు సీన్స్ చేసి మొత్తానికి తెగ సంబరబడిపోతుంది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తోన్న ‘విక్రాంత్ రోణ’ అనే సినిమాలో తాను కీలకపాత్రలో నటిస్తున్నాను అంటూ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో ఆమె పాత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ సందర్భంగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మాట్లాడుతూ ‘విక్రాంత్ రోణ’ సినిమాలో భాగమైన ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదించాను. ప్రతి విషయంలో నేను చాలా ఎగ్జయిట్‌మెంట్ అవుతూ ఉంటాను. నా కెరీర్‌లో ఈ సినిమా ఒక సూపర్ స్పెషల్ గా నిలిచిపోతుంది. నాకు జీవితాంతం గుర్తుండిపోయే చిత్రమవుతుంది’’ అంటూ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తెగ సంతోషపడిపోతుంది.
ఎందుకు ఈ హాట్ బ్యూటీ ఇంతగా బిల్డప్ ఇస్తోంది అంటే.. అమ్మడికి మంచి రెమ్యునరేషన్ అందింది. దాంతో ఈ సినిమా గురించి తెగ పొగుడుతూ ఉంది. ఇక ఈ చిత్రంలో రాక్వెల్ డీ కోస్టా అలియాస్ గదంగ్ రాక్కమ్మగా ఆమె నటిస్తున్నారు. అన్నట్టు ముంబై బిల్ బోర్డ్స్ సహా ఇతర నగరాల్లో కూడా ఈ సినిమాలోని జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫస్ట్ లుక్ ను ప్రదర్శించనున్నారు. ‘
అనూప్ భండారీ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాని జాక్ మంజునాథ్– షాలిని మంజునాథ్ నిర్మిస్తున్నారు. ‘రాబోయే తరాలు గుర్తు పెట్టుకునేలా ఓ సినీ అద్భుతాన్ని సృష్టించే దారిలో ప్రయాణిస్తున్నాం’ అంటూ ఈ సినిమా నిర్మాత జాక్ మంజునాథ్ చెబుతున్నాడు. మరి ఏమిటో అద్భుతం అనేది ఆయనకే తెలియాలి. ఈ చిత్రానికి బి.అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Jacqueline fernandez reveals her character from vikrant rona
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com