
Jabardhasth Anchor : ఈ మధ్య కుటుంబం చూసే టీవీ షోస్ లో కాస్త అడల్ట్ కంటెంట్ ఎక్కువైపోతోంది.వెబ్ సిరీస్ లో ఎలాగో ఇలాంటివి తప్పవు, చూసే వాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు.కానీ రెగ్యులర్ గా జనాలు వీక్షించే పాపులర్ షోస్ లో కూడా ముద్దులు రొమాన్స్ లు ఎక్కువ అయిపోతున్నాయి.రీసెంట్ గా జబర్దస్త్ షో లో అలాంటిదే జరిగింది.గత కొంత కాలం క్రితమే ఈ షోస్ కి యాంకర్ గా చేసే రష్మీ మరియు అనసూయ మానేశారు.
అప్పటి నుండి ప్రముఖ సీరియల్ ఆర్టిస్ట్ సౌమ్య రావు యాంకర్ గా చేస్తుంది.ఈమెకి వచ్చిన కొద్దీ కాలం లోనే మంచి క్రేజ్ ఏర్పడింది.ముఖ్యంగా యూత్ లో ఈమె ఫాలోయింగ్ రష్మీ మరియు అనసూయలను కూడా దాటేసింది.ఇన్ని రోజులు ఈమె డీసెంట్ గానే ఉన్నప్పటికీ త్వరలో ప్రసారం అవ్వబొయ్యే జబర్దస్త్ ఎపిసోడ్ లో సౌమ్య రావు కృష్ణ భగవాన్ కి ముద్దు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్ గానే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు.ఈ ప్రోమో లో సౌమ్య రావు కృష్ణ భగవాన్ చెంప మీద ముద్దు పెట్టడానికి పరిగెత్తుకుంటూ వస్తుంది.అప్పుడు కృష్ణ భగవాన్ తో పాటు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న ఇంద్రజ మార్క్స్ బోర్డు కృష్ణ భగవాన్ బుగ్గకి అడ్డం గా పెడుతుంది.అప్పుడు సౌమ్య రావు ఆయన చేతికి ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది.అసలు ఆమె ఎందుకు ముద్దు పెట్టింది అనే విషయాన్నీ మాత్రం ఈ ప్రోమో లో చూపించలేదు.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.మీరు కూడా ఆ ప్రోమోని క్రింద చూసేయండి.
