Jabardhast Anchor Soumya Rao Biography : జబర్దస్త్ కామెడీ షోలో నవ్వులు పూయిస్తున్న గ్లామరస్ యాంకర్ సౌమ్య రావు నిజ జీవిత కథ మాత్రం విషాదమయం. ఆమె ఓ అనాథ. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సౌమ్య రావు గతంలో తన దీన పరిస్థితి వివరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సౌమ్య రావు లేటెస్ట్ బుల్లితెర సెన్సేషన్. లెజెండరీ కామెడీ షో జబర్దస్త్ కి ఆమె యాంకర్ గా రావడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. అనసూయ జబర్దస్త్ మానేయడంతో కొన్ని ఎపిసోడ్స్ కి రష్మీ గౌతమ్ యాంకర్ గా చేశారు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోస్ కి రష్మీనే యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

నవంబర్ 10 జబర్దస్త్ ఎపిసోడ్ నుండి కొత్త యాంకర్ రంగంలోకి దిగింది. కన్నడ బ్యూటీ సౌమ్య రావుని అనసూయ స్థానంలోకి తీసుకున్నారు. ఇక సౌమ్య రావు యాంకర్ గా రెండు ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. సౌమ్య గ్లామర్ పరంగా, కామెడీ పంచెస్ పరంగా తన మార్క్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే అంత త్వరగా గుర్తింపు రాదు. ఆమెను ప్రేక్షకులు అంగీకరించడానికి కొంత సమయం పడుతుంది.
ఇక షోలో తన అందంతో కామెడీ పంచెస్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న సౌమ్య రావు నిజ జీవితం మాత్రం విషాదకరం. ఈటీవీ యానివర్సరీ సందర్భంగా నిర్వహించిన స్పెషల్ ఈవెంట్లో సౌమ్య రావు పాల్గొన్నారు. సదరు ఈవెంట్ లో యాంకర్ ప్రదీప్ తన గురించి ఏదైనా చెప్పాలని కోరారు. అప్పుడు, నాకు ఎవరూ లేరు నేను ఒక అనాథను అని చెప్పి ఎమోషనల్ అయ్యారు. అమ్మ చనిపోయారు. నాన్న ఉన్నా లేనట్లే. ఆయన నన్ను పట్టించుకోరు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ అమ్మా, నాన్నా, అన్న, చెల్లి ఎవరో ఒకరు ఉన్నారు. నాకు మాత్రం ఎవరూ లేరంటూ సౌమ్య కన్నీరు పెట్టుకున్నారు.
సౌమ్య రావు మాటలు ప్రతి ఒక్కరినీ కదిలించాయి. కన్నడ పరిశ్రమలో న్యూస్ రీడర్ గా, సీరియల్ యాక్టర్ గా సౌమ్య రావు కెరీర్ మొదలైంది. తెలుగులో కూడా కొన్ని సీరియల్స్ లో నటించారు. ఈమె ఎక్కువగా విలన్ రోల్స్ చేస్తారని సమాచారం. మరి జబర్దస్త్ షోలో ఆమె జర్నీ ఎలా సాగుతుందో చూడాలి. కాగా రష్మీ సైతం తండ్రి వదిలేసి వెళితే సింగిల్ మదర్ నన్ను ఎంతో కష్టపడి పెంచారని గతంలో చెప్పడం విశేషం.