Jabardasth Varsha: జబర్ధస్త్.. ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ కమెడియన్స్ బయటకు వచ్చారు. ఇక మగాళ్లే లేడీ వేషాలు వేసి వెగటు పుట్టించినవేళ..అచ్చమైన అమ్మాయిలు కొందరు కామెడీ పండించారు. అందులో వర్ష , ఫైమా లాంటి వారు పాపులర్ అయ్యారు. చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ వచ్చిన వర్ష ఇప్పుడు జబర్ధస్త్ లో ప్రధాన లేడీ కమెడియన్ గా పేరొందారు. జబర్ధస్త్ తోనే ఆమెకు అంత క్రేజ్ వచ్చేసింది.

వర్ష అందానికి ఫిదా అవ్వని వారు ఉండరు. కమెడియన్ ఇమ్మాన్యూయేల్ తో ఆమె ప్రేమ తెరపై అందరినీ ఆకర్షిస్తుంది. లేడీ గెటప్ లు చూసి విసిగిపోయిన వారికి వర్ష అందంతో చేసే కామెడీ ఫిదా చేస్తుంటుంది. వర్ష-ఇమ్మాన్యూయేల్ ప్రేమ జబర్ధస్త్ కే ఓ ఆకర్షణగా నిలుస్తోంది. సుధీర్ -రష్మీ తర్వాత ఈ జోడీకి అంతటి పేరుంది.
వర్ష సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఆమె పెట్టే నగ్న ఫొటోలు, అర్ధనగ్న అందాలకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. తాజాగా వర్ష ఆరోగ్యం బాగాలేదని తెలుస్తోంది. ఆదివారం ఆమె తీవ్ర అనారోగ్యం బారిన పడడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారట.. ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్న ఫొటో బయటకు వచ్చింది. చేతికి సెలైన్లు.. ముక్కుకు ఆక్సిజన్ తో వర్షను అలా చూసి అందరూ షాక్అయ్యారు. ఏమైందని ఆరాతీస్తున్నారు.
ఆదివారం ఆమె చికెన్ తిన్నదని.. దాంతో ఫుడ్ పాయిజన్ అయ్యి తీవ్ర అస్వస్థతకు గురైందని అంటున్నారు. ఏవో ట్యాబ్లెట్లు వేసుకుంటే మరింతగా సీరియస్ కావడంతో ఆస్పత్రికి తరలించినట్టు ప్రచారం సాగుతోంది.

మరి నిజంగానే వర్షకు ఫుడ్ పాయిజన్ అయ్యిందా? ఆమె ఆస్పత్రి బెడ్ పై అలా ఉన్న ఫొటో నిజమేనా? సీరియస్ గా ఉందన్న విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై వర్ష స్నేహితులు కానీ.. ఇమ్మాన్యూయేల్ కానీ ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. వర్ష ఆరోగ్యం బాగుపడాలని నెటిజన్లు కోరుతున్నారు.