Punch Prasad Health: అనారోగ్యం మనుషులను, కుటుంబాలను కకావికలం చేస్తుంది అనడానికి పంచ్ ప్రసాద్ జీవితమే ఉదాహరణ. జబర్దస్త్ కమెడియన్ గా పేరు తెచ్చుకొని కెరీర్లో సెటిల్ అయిన పంచ్ ప్రసాద్ ని హెల్త్ దెబ్బతీసింది. అతడు కిడ్నీ సంబంధిత వ్యాధికి గురయ్యాడు. ఖరీదైన వైద్యం కావడంతో జబర్దస్త్ జడ్జెస్ రోజా, నాగబాబు, తోటి కమెడియన్స్ తలా కొంత సహాయం చేశారు. ఆపరేషన్ చేయించుకొని తిరిగి కోలుకున్నాడు. అయినప్పటికీ అతడికి డయాలసిస్ చేయాల్సి ఉంది. మిత్రుల సహకారంతో మళ్ళీ జబర్దస్త్ లోకి వచ్చాడు. అలాగే కొత్తగా ప్రారంభమైన జాతిరత్నాలు స్టాండప్ కామెడీ షోలో పాల్గొంటున్నారు.

ఆ విధంగా వచ్చిన డబ్బులతో తన ఆరోగ్యంతో పాటు కుటుంబాన్ని పోషిస్తున్నాడు.కాగా పంచ్ ప్రసాద్ సడన్ గా నడవలేని స్థితికి చేరుకున్నాడు. కనీసం కదల్లేక ఇబ్బందిపడుతున్న పంచ్ ప్రసాద్ వీడియో బయటకు వచ్చింది. అభిమానులు, మిత్రులు ఆదుకుంటారన్న ఆశతో పంచ్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియో నూకరాజు అప్లోడ్ చేశారు. అలాగే పంచ్ ప్రసాద్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి వివరించారు.
పంచ్ ప్రసాద్ భార్య మాట్లాడుతూ… షూటింగ్ అయ్యాక ఒక రోజు పంచ్ ప్రసాద్ జ్వరంతో ఇంటికి వచ్చాడు. ఆ రోజు రాత్రి విపరీతమైన నడుము నొప్పితో బాధపడ్డాడు. ఫస్ట్ బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చిందో డాక్టర్స్ కి అర్థం కాలేదు. తర్వాత పరీక్షించి సమస్య ఏమిటో చెప్పారు. అతనికి నడుము ఎడమ వైపు నుండి కాలి వరకు చీము చేరిందని చెప్పారు. అందుకే జ్వరం, నొప్పి వచ్చాయని వెల్లడించారు. ఇలా ఎందుకు జరిగిందో కూడా అర్థం కావడం లేదని డాక్టర్స్ అన్నట్లు పంచ్ ప్రసాద్ భార్య చెప్పి ఆవేదన చెందారు.

తను ఇలా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం అభిమానులకు తెలియడం పంచ్ ప్రసాద్ ఇష్టపడలేదు. అతనికి తెలియకుండా వీడియో షూట్ చేసి నూకరాజు యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. సదరు వీడియోలో పంచ్ ప్రసాద్ పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. అభిమానులు పంచ్ ప్రసాద్ ని ఆదుకోవాలని నూకరాజు ఆ వీడియోలో విజ్ఞప్తి చేశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పంచ్ ప్రసాద్ ని మరో కొత్త సమస్య పీడిస్తున్నట్లు తెలుస్తోంది. జాతిరత్నాలు షోలో సైతం పంచ్ ప్రసాద్ నిల్చోవడం లేదు. వేదికపై ఒక చైర్ లో కూర్చొని షో చేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=VRiSOokeuvA