Jabardast Varsha : పాప్యులర్ కామెడీ షో జబర్దస్త్ అనేక మంది సామాన్యులను స్టార్స్ గా మార్చింది. అనసూయ, రష్మీ, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, చమ్మక్ చంద్ర.. చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్దది. అలా జబర్దస్త్ వేదిక కెరీర్లో సెటిల్ అయిన నటి వర్ష. ఈమె గతంలో సీరియల్స్ చేసేది. సీరియల్ నటిగా బ్రేక్ రాలేదు. దానితో జబర్దస్త్ వైపు అడుగులు వేసింది. సాధారణంగా జబర్దస్త్ లో అబ్బాయిలు లేడీ గెటప్స్ వేస్తారు. లేడీ కమెడియన్స్ చాలా తక్కువ. ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు.
వర్ష అనతికాలంలో ఫేమ్ తెచ్చుకుంది. ఆమె గ్లామర్ తో పాటు ఇమ్మానియేల్ తో ఆమె నడిపిన లవ్ ట్రాక్, బుల్లితెర ఆడియన్స్ కి దగ్గర చేసింది. అసలు ఇమ్మానియేల్ నా సర్వస్వం అన్నట్లు వర్ష మాట్లాడేది. అతడితో కలిసి స్కిట్స్ చేసేది. సుడిగాలి సుధీర్-రష్మీ అనంతరం ఆ స్థాయిలో పాప్యులర్ అయిన బుల్లితెర లవ్ బర్డ్స్ వర్ష-ఇమ్మానియేల్ అనడంలో సందేహం లేదు.
అయితే వీరి మధ్య ఉంది ప్రేమా లేక స్నేహమా? అనే సందేహం ఉంది. సెట్ నుండి బయటకు వెళ్ళాక వర్ష ఎవరో నేనెవరో… నా ముఖం కూడా దేకదు, అని పలు సందర్భాల్లో ఇమ్మానియేల్ ఓపెన్ అయ్యాడు. అయితే ఎక్కడో వీరి మధ్య సాన్నిహిత్యం ఉందనే వాదన ఉంది. తాజాగా వర్ష ఓ టెలివిజన్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో సెలెబ్స్ 2024లో తమకు ఎదురైన అనుభవాలు పంచుకున్నారు. మంచి చెడులను విశ్లేషించుకున్నారు.
వర్ష వంతు రాగా… తన జీవితంలో 2024 అత్యంత భయానక సంవత్సరంగా ఆమె పేర్కొన్నారు. మరలా ఇలాంటి సంవత్సరం ఎదురు కాకూడదని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. చాలా అశుభాలు జరిగాయట. ముఖ్యంగా ఇష్టమైన వారితో మనస్పర్థలు తలెత్తాయట. ఇమ్మానియేల్-వర్ష పలుమార్లు గొడవలు పడ్డారట. ఇంస్టాగ్రామ్ లో కూడా బ్లాక్ చేసుకున్నారట. గొడవలకు కారణాలు ఏమిటో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాలి. ఇక వర్షకు ఇమ్మానియేల్ లైఫ్ ఇచ్చాడు అనడంలో సందేహం లేదు. జబర్దస్త్ లో తాను సీనియర్ కమెడియన్ కాగా, ఆరంభంలో వర్షకు సప్పోర్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం వర్షకు ఇంస్టాగ్రామ్ లో రెండు మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. రెండు చేతులా వర్ష సంపాదిస్తుంది.