Jaat Trailer: ఇప్పటి వరకు తెలుగులో చాలా మాస్ సినిమాలు వచ్చాయి. ప్రతి సినిమాలో ఏదో ఒక పాయింట్ ను హైలెట్ చేస్తు భారీ సక్సెస్ లను సాధించినవే కావడం విశేషం…ఇక ప్రస్తుతం బాలీవుడ్ ప్రేక్షకులు సైతం తెలుగు సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మన లాంటి సినిమాలను తీయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు…
Also Read: కన్నప్ప మూవీ పై ట్రోల్స్ చేస్తే సర్వ నాశనమైపోతారు – మూవీ టీం
కమర్షియల్ సినిమాలు చేయడం లో సిద్దహస్తుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు గోపిచంద్ మలినేని…తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు భారీ విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్ళాయి…ప్రస్తుతం ఆయన బాలీవుడ్ స్టార్ హీరో అయిన సన్నీ డియోల్ తో ‘జాట్’ (Jaat) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా హిందీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఔట్ అండ్ ఔట్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ ట్రైలర్ ను అయితే కట్ చేశారు. ఇక సన్నీ డియోల్ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తూ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. గోపీచంద్ మలినేని ఈ సినిమాకోసం ఒక డిఫరెంట్ స్టైల్ లో మేకింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆయన సినిమాల్లో రోటీన్ సీన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి.
కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మొత్తం నెక్స్ట్ లెవల్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఈ సినిమాతో షేక్ అవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి తను ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ట్రైలర్ ను కనక అబ్జర్వ్ చేసినట్లయితే ‘లంక అనే ఊరిలో ఒక రౌడీ ఉంటాడు.
అతన్ని వీళ్ళు ఎలా ఎదురుకున్నారు అనేది సినిమా గా తెలుస్తోంది’. ‘ఈ లంక లో అడుగుపెట్టేందుకు భవంతుడు కూడా భయపడతాడు’ అంటూ రెజీనా చెప్పిన డైలాగ్ హైలెట్ అయింది. ఈ ట్రైలర్ ను కనక చూస్తే సినిమా మొత్తం యాక్షన్ తో నింపేశారు. ఇక ఊరు తాలూకు ఎమోషన్స్ ను కూడా చాలా బాగా బిల్డ్ చేసినట్టుగా తెలుస్తోంది…
మొత్తానికైతే తెలుగు లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చే సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసి బాలీవుడ్ ను షేక్ చేయాలని గోపీచంద్ మలినేని చూస్తున్నాడు. మరి ఈ మూవీ బాలీవుడ్ వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…
Also Read: ‘రాజా సాబ్’ టీజర్ రెడీ..ఇది కేవలం హర్రర్ థ్రిల్లర్ మాత్రమే కాదండోయ్!