Jaat Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే గోపీచంద్ మలినేని లాంటి కమర్షియల్ సినిమా డైరెక్టర్లు సైతం ప్రస్తుతం టాలీవుడ్ లో కాకుండా బాలీవుడ్ హీరోలను మెప్పిస్తూ అక్కడ సినిమాలను చేసి భారీ విజయాలను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే సన్నీ డియోల్ తో ఆయన చేసిన జాట్ (Jaat) సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడి మెప్పించిందా? లేదా గోపీచంద్ మలినేని కి బాలీవుడ్ లో సక్సెస్ దక్కిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read:‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫుల్ మూవీ రివ్యూ…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ముంబైలోని ఒక ప్రాంతాన్ని ఒక రౌడీ పాలిస్తూ ఉంటాడు. అతని ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. దాంతో సన్నీ డియోల్ అక్కడికి వెళ్లి ఏం చేశాడు. అక్కడి జనాన్ని ఎలా కాపాడాడు అనే విషయం మీకు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి ఇలాంటి కథ తో తెలుగులో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. అందుకే దర్శకుడు కూడా మేకింగ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది.బాలీవుడ్ సినిమా అనగానే ప్రతి ఒక్కరూ భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసేటప్పుడు తెలుగు దర్శకులు చాలా జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సినిమా సక్సెస్ అయితే తమ తర్వాత సినిమాకి మరో బాలీవుడ్ స్టార్ హీరోను లైన్ లో పెట్టొచ్చు అనే ఉద్దేశంతో వాళ్లు అలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని కూడా ఈ సినిమాలో చాలావరకు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే విధంగా చూసుకున్నాడు.
ఇక ‘పుష్ప 2’ సినిమా రావడంతో బాలీవుడ్ ప్రేక్షకులందరికి మాస్ సినిమాల మీద విపరీతమైన క్రేజ్ అయితే పెరిగింది. ఇక దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ని విపరీతంగా పెట్టారు. అయితే సినిమా మొత్తం ఒక మూడు లో వెళ్ళినప్పటికి యాక్షన్ ఎలిమెంట్స్ తోనే ఉండటం వల్ల సినిమా చూసే ప్రేక్షకుడికి కథలో పెద్దగా కాన్ఫ్లిక్ట్ లేకపోయినా యాక్షన్ ఎపిసోడ్స్ ని హైలైట్ చేస్తున్నారనే ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది. మరి తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. కాబట్టి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఈ సినిమా నచ్చకపోవచ్చు కానీ బాలీవుడ్ ప్రేక్షకులను కొంతవరకు ఎంగేజ్ చేసే అవకాశాలైతే ఉన్నాయి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే సన్ని డియోల్ ఈ సినిమాలో చాలా అద్భుతమైనటువంటి నటనను కనబరచడమే కాకుండా ఆయనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా ఆయన పాత్రలో ఒదిగిపోయి నటించడమే కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా చాలా వైల్డ్ రేంజ్ లో చేశాడు. ఇక్ రణదీప్ హుడా,వినీత్ కుమార్, ప్రశాంత్ బజాజ్ లాంటి నటులు సైతం వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. నిజానికి వీళ్ళందరూ మంచి నటులు కానీ వాళ్ళ పాత్రను ఎలివేట్ చేసే క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో పెద్దగా పడలేదని చెప్పాలి. దాంతో ఉన్నంతలో వాళ్ళ పాత్రలని చాలా బాగా చేసి మెప్పించారు… రెజీనా కూడా చాలా రోజుల తర్వాత మరోసారి ఒక మంచి పాత్రలో కనిపించింది…
టెక్నికల్ అంశాలు
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్ చాలా వరకు ప్లస్ అయింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే బాగా వర్క్ అవుట్ అయింది. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ ను కూడా ఎలివేట్ చేసే విధంగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఉండడం అలాగే సినిమా మీద హైప్ ని పెంచడానికి చాలాచోట్ల తమన్ కొత్త ఇన్స్ట్రుమెంట్స్ ని వాడి మంచి బిజీయం ని అయితే క్రియేట్ చేశాడు… రిషి పంజాబీ అందించిన విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ట్రైలర్ లో వచ్చిన విజువల్స్ ద్వారానే సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ అయింది…
ప్లస్ పాయింట్స్
సన్నీ డియోల్
యాక్షన్ ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
మధ్యలో కొంచెం స్లో అయింది…
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5