
Item Songs: తెలుగు పరిశ్రమలో మళ్ళీ ఐటమ్ సాంగ్స్ ట్రెండ్ మొదలైంది. బన్నీ, మహేష్, ప్రభాస్ ఇలా ప్రతి స్టార్ హీరో ప్రస్తుతం చేస్తోన్న ప్రతి సినిమాలో ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. పెద్ద హీరోయిన్సే డబ్బు కోసం ఆ సాంగ్స్ లో నటిస్తున్నారు, వాటిని సమర్ధిస్తున్నారు. అయినా ఈ ఐటెం సాంగ్స్ ఇప్పటివా ? జ్యోతిలక్ష్మి, జయమాలిని దగ్గర నుంచి వున్నాయి. మంచి హుషారైన బీట్ తో అమ్మాయి కాస్త అందంగా కనిపిస్తే తప్పేముంది ? అనేది సినిమా వాళ్ళ అభిప్రాయం.
కానీ అత్యాచారాలు ఇలాంటి మితిమీరిన బోల్డ్ సాంగ్స్ వల్లే జరుగుతున్నాయని కొంతమంది ఆరోపణ. అయితే, వెస్ట్రన్ కంట్రీస్ లో స్ట్రిప్ క్లబ్స్ ఉంటాయి, ప్రతీ చోట దాని వల్ల అక్కడ అత్యాచారాలు పెరిగాయా…? ఎవడో ఎక్కడో ఏదో తప్పు చేసాడు అని మన జీవితాల్లో వుండే ప్రతి విషయానికి ముడి పెట్టడం మంచిది కాదు అని, అలాగే సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పడం భావ్యం కాదు అనేది మేకర్స్ వాదన.
ఏది ఏమైనా బూతు పదాలకు అనుగుణంగా ఒక అందమైన అమ్మాయి హొయలు వొలికించడం అనేది మంచిది కాదు. సాధారణంగా మూవీ అనేది ఒక పవర్ ఫుల్ మీడియం… ఆధ్యాత్మికంగా మాట్లాడుకున్నా, సైన్స్ ప్రకారం చూసుకున్నా మనకున్న పంచేంద్రియాలలో ‘కళ్ళు’ చాలా శక్తివంతమైనవి.
అంటే మనం చూసేదే ఎక్కువగా నమ్ముతాం, ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తాం. అందుకే మూవీస్ తీసేటప్పుడు కాస్త సామాజిక కోణంలో కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అసలు మందు ఎక్కువగా ప్రమోట్ చేసింది ఈ సినిమా వాళ్లే అని కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. అప్పట్లో ఒక హీరో గ్లాస్ పట్టుకుని కనిపిస్తే అదే ఫ్యాషన్ అయిపోయింది.
అందుకే సినిమా వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో బాధ్యత వహించాలి. చాలా సర్వేలు కూడా ఈ ఐటెమ్ సాంగ్స్ వల్ల విపరీత ధోరణి కలుగుతుంది అని చెప్తున్నాయి. ఇప్పటికైనా ఐటమ్ సాంగ్స్ విషయంలో పరిధి దాటకుండా ఉంటే మంచిది.