Hyper Aadi: హైపర్ అది.. జబర్ధస్త్ ప్రేక్షకులకి చాలా సుపరిచితం. జబర్దస్త్ కామెడీ షోలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు హైపర్ అది. ముఖ్యంగా యూత్ లో హైపర్ అది స్కిట్స్ కి ఫుల్ డిమాండ్ ఉంది. పైగా హైపర్ అది స్కిట్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇటీవల హైపర్ అది ప్రేమలో పడ్డాడు అట.

గత కొన్నాళ్లుగా తనతో పాటు ఓ సినిమాలో నటిస్తున్న సహా నటిని ప్రేమిస్తున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఈటీవీ 27 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ‘భలే మంచిరోజు’ అనే స్పెషల్ షో ప్లాన్ చేశారు. ఇందులోకి ఈటీవీలోని పాత ఆర్టిస్టులందరినీ పిలిచారు. ఈ ఈవెంట్ రెండో భాగం సెప్టెంబర్ 4న ప్రసారమైంది. ఈ ప్రోగ్రాంలోనే ‘శతమానం భవతి’ సీరియల్ నటితో తాను ప్రేమలో పడ్డట్లు హైపర్ ఆది ఓపెన్ అయ్యాడు. ఆమె కూడా ఆదితో డ్యాన్స్ చేయడం.. కాలు మీద కూర్చుంటూ ప్రొసీడ్ అయిపోయింది. ఇద్దరిపై లవ్ సింబల్స్ కూడా వేసేశారు. దీంతో ఆ నటితో హైపర్ ఆది ప్రేమలో పడిపోయానని స్టేజీమీదనే ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.

ఇది వరకూ యాంకర్ సుజాతతో కూడా హైపర్ ఆది ప్రేమలో ఉన్నట్టు చూపించారు. ‘ఆది – సుజాత’లది నిజమైన ప్రేమ అని, త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరూ కలిసి జీవితం పంచుకుంటే కచ్చితంగా బాగుంటుంది అంటూ ప్రేక్షకులు కూడా ఫీల్ అవుతున్నారు. అసలు ఇంతకీ ఈ వార్తలో ఎంత నిజం ఉందో చూడాలి.
ప్రస్తుతం బుల్లితెరపై హైపర్ ఆదికి ఫుల్ డిమాండ్ ఉంది. బిజీ షెడ్యూల్ కారణంగా గ్యాప్ తీసుకొని మళ్లీ వచ్చాడు. ప్రస్తుతం జబర్ధస్త్ తోపాటు ఢీ14, శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ రెండు షోలలోనే పనిచేస్తూ తనదైన పంచ్ డైలాగ్సూ్ తో ఆది నవ్విస్తున్నాడు.