Homeఎంటర్టైన్మెంట్IT Ride: విజయ్ మాస్టర్ సినిమా నిర్మాత ఇంటిపై ఐటీ దాడులు

IT Ride: విజయ్ మాస్టర్ సినిమా నిర్మాత ఇంటిపై ఐటీ దాడులు

IT Ride: తమిళ్ సూపర్​స్టార్ ఇళయతలపతి విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమా నిర్మాత జేవియర్ బ్రిటో ఇంటిపై ఐటీ శాఖ దాడి చేసింది. ఆయన ఆస్తులకు సంబంధించి పలు అనుమానాలు రావడంతో ఆదాయపు పన్ను శాఖ బ్రిటో ఇంట్లో తనిఖీ నిర్వహించింది. చైనా మొబైల్​ తయారీ కంపెనీలకు సంబంధించి బ్రిటోకు చెందిన ఆదంబాక్కం ఇల్లు, అడయార్ కార్యాలయంపై దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

it-raid-at-the-properties-of-master-producer-xavier-britto

మొబైల్​ కంపెనీతో బ్రిటో పెట్టుకున్న సంబంధాలే ఐటీ సాదాకు ప్రధాన కారణమని తెలుస్తోంది. గతంలోనూ మాస్టర్ సినిమా షూటింగ్ సమయంలో హీరో విజయ్​ని  ఐటీ శాఖ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. విజయ్​ హీరోగా సూపర్​ హిట్​గా నిలిచిన బిగిల్ బాక్సాఫీసు కలెక్షన్లకు సంబంధించి వివరాలు ఆరా తీసింది.

ప్రస్తుతం బీస్ట్ సినిమాలో విజయ్ కనిపించనున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్నఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. కాగా, సెల్వ రాఘవన్​, యోగిబాబు, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యాంక్రోల్ చేసిన ఈ సినిమా 2022లో థియేటర్లలో విడుదల కానుంది. అయితే, విడుదల ఎప్పుడన్నది మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మాస్టర్ సినిమాతో సూపర్​హిట్​ అందుకున్న విజయ్.. బీస్ట్ సినిమాతో మరో హిట్​ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగులోనే విజయ్​కి మంచి ఫ్యాన్​ ఫాలోయింగ్​ ఉన్న సంగతి తెలిసిందే.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular