Heroes
Heroes : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సక్సెస్ బాట పట్టడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళ సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.ఇక ఇప్పటికే ప్రభాస్ లాంటి స్టార్ హీరో బాహుబలి(Bahubali),సలార్(Salaar), కల్కి(Kalki) లాంటి సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించి పాన్ ఇండియాలో సక్సెస్ ఫుల్ హీరోగా ముందుకు సాగుతున్నాడు. మరి వీళ్ళ తర్వాత పుష్ప 2 (Pushpa 2) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ కూడా దాదాపు నెంబర్ వన్ రేసులో ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి. మరి వీళ్ళిద్దరి మధ్య నెంబర్ వన్ పోటీ కోసం తీవ్రమైన పోటీ అయితే నడుస్తుంది. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళ మధ్య ఎదురయ్యే పోటీలో ఎవరు విజయం సాధించబోతున్నారు తద్వారా ఎవరు నెంబర్ వన్ పొజిషన్ కైవసం చేసుకోబోతున్నారు అనే విషయాలు అయితే తెలియాల్సి ఉన్నాయి…రెండో ప్లేస్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరూ కనక మరొక భారీ సక్సెస్ ని సాధించినట్లయితే వీళ్ళు కూడా నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకోవడానికి పోటీలో ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. రీసెంట్ గా రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన క్రేజ్ కొంతవరకు పడిపోయింది.
తద్వారా నెంబర్ 2 పోజిషన్ కోసం తను పోటీపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం దేవర సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తాడని అందరూ అనుకున్నప్పటికి ఆ సినిమా ఎవరిని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
తద్వారా ఎన్టీఆర్ సైతం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాడు. ప్రస్తుతానికైతే వీళ్ళు నెంబర్ 2 పొజిషన్ కోసం పోటీలో ఉన్నారు. ఈ సమయం సూపర్ సక్సెస్ లను సాధిస్తే నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకోవడం పెద్ద కష్టమైతే కాదు.
మరి ఏది ఏమైనా కూడా అటు అల్లు అర్జున్ ప్రభాస్ ల మధ్య భీకరమైన పోటీ అయితే నడుస్తుంది. అలాగే రామ్ చరణ్ ఎన్టీఆర్ ల మధ్య కూడా చాలా గొప్ప పోరాటం నడుస్తోంది. మరి వీళ్ళందరిలో ఎవరు పై చేయి సాధిస్తారు ఎవరు విజయాన్ని సాధించి వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటారనేది తెలియాల్సి ఉంది…