Dhruv Vikram vs Akkineni Akhil: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసుల హవా ఎక్కువైపోతోంది. చాలామంది హీరోలు వారసత్వంగా ఇండస్ట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో కొంతమంది సక్సెస్ లను సాధిస్తుంటే మరి కొంతమంది మాత్రం డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలో బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టార్ హీరోలు సైతం సక్సెస్ లను సాధించలేక చేతులెత్తేస్తుండడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరు మంచి విజయాలను సాధిస్తున్న క్రమంలో అఖిల్ మాత్రం ఇప్పటివరకు ఒక సక్సెస్ ను కూడా సాధించలేకపోయాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికి ఆ తర్వాత చేసిన సినిమాలు ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి…ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా మాత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది… ప్రస్తుతం లెనిన్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కనక డిజాస్టర్ గా మారితే మాత్రం ఆయన కెరియర్ డైలమాలో పడిపోతుందనే చెప్పాలి… ఇక తమిళ్ స్టార్ హీరో విక్రమ్ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.
తన కొడుకు అయిన ధృవ్ విక్రమ్ సైతం హీరోగా మారి తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాని తమిళంలో ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్ చేశాడు. అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ధృవ్ హీరోగా పనికిరాడు అంటూ చాలామంది అతనిమీద ట్రోల్స్ చేశారు.
కానీ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఆయన చేసిన ‘బైసన్’ సినిమా రీసెంట్ గా రిలీజై మంచి విజయాన్ని సాధించింది…తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమాకు దక్కుతున్న ఆదరణ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఒకరకంగా నాగార్జున కొడుకు అఖిల్ తో పోల్చుకుంటే విక్రమ్ కొడుకు విక్రమ్ చాలా బెటర్ అని విక్రమ్ లాగే అతను కష్టపడుతూ చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నాడంటూ అతని మీద కొంతమంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు…
అఖిల్ వర్సెస్ ధృవ్ విక్రమ్ ఇద్దరిలో ధృవ్ చాలా టాప్ పొజిషన్ కి వెళ్తాడని చెబుతున్నారు. ఇక అఖిల్ కి మరో ప్లాప్ పడితే మాత్రం కెరీర్ డైలమాలో పడిపోతుందని విమర్శిస్తున్నారు. ఇక ఇప్పుడు అఖిల్ తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయమైతే ఆసన్నమైంది. ఇక తను ఇప్పుడు కూడా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు అంటూ సినిమా విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తుండటం విశేషం…