Vijay Devarakonda Kingdom: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. అందులో మన తెలుగు హీరోలే ఎక్కువగా ఉండటం విశేషం. పాన్ ఇండియా ఇండస్ట్రీ గా మారిన తర్వాత సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకుల్లో మంచి ఆదరణను సంపాదించుకుంటున్నాయి. ముఖ్యంగా మన తెలుగు సినిమాలకు పాన్ ఇండియాలో మంచి మార్కెట్ క్రియేట్ అయిందనే చెప్పాలి…
అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)… ఈ మూవీతో ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన వరుస సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్నానూరి (Goutham Thinnanuri) దర్శకత్వంలో చేస్తున్న కింగ్ డమ్ (Kingdom) సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది డూ ఆర్ డై గా మారింది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆయన చేసిన సినిమాలేవి ప్రేక్షకులను మెప్పించకపోవడంతో ఆయన మార్కెట్ అంతకంతకు డౌన్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా లైగర్(Liger), ఖుషీ (Khushi) లాంటి సినిమాలు అతన్ని బాగా నిరాశపరచాయి. ఈ సినిమాల వల్ల అతనికి కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి. మరి తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ భారీ మార్కెట్ ని క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం ఇప్పుడు మంచి సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఇక రెండు పార్టు లుగా రిలీజ్ అవుతున్న కింగ్ డమ్ (Kingdom) సినిమా భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం ఆయన పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా ఇప్పుడున్న స్టార్ హీరోలందరికి పోటీని ఇచ్చే హీరోగా తయారవుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఇప్పటికే సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.
మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని తెరకెక్కించి ఉంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో బ్లాక్ బస్టర్ అవుతుంది. లేకపోతే మాత్రం భారీ డిజాస్టర్ ని మూట గట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడవచ్చు…గౌతమ్ తిన్నానూరి కి కూడా ఈ మూవీ డూ ఆర్ డై గా మారబోతుంది.
ఎందుకంటే ఇంతకుముందు ఆయన చేసిన జెర్సీ (Jersy) సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికి హిందీలో చేసిన జెర్సీ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో బాలీవుడ్లో ఆయన పేరు అయితే అందరికి తెలుసు కానీ సక్సెస్ మాత్రం రాలేదు. కాబట్టి ఈ సినిమాతో సక్సెస్ ని సాధించి తను కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది…
మరి ఈ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతటి విజయాన్ని సాధిస్తోంది. తద్వారా వాళ్ళకంటూ ఒక మార్కెట్ క్రియేట్ అవుతుందా? అలాగే స్టార్ హీరోలతో గౌతమ్, స్టార్ డైరెక్టర్లతో విజయ్ సినిమాలను చేసే అవకాశం వస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…