Homeఎంటర్టైన్మెంట్KGF-3 Story: కేజీఎఫ్-2ను మించి కేజీఎఫ్-3 ఉండబోతుందా? వైరల్ పిక్..!

KGF-3 Story: కేజీఎఫ్-2ను మించి కేజీఎఫ్-3 ఉండబోతుందా? వైరల్ పిక్..!

KGF-3 Story Viral Pic: కన్నడ రాక్ స్టార్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెల్సిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘కేజీఎఫ్’ మూవీ విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. ‘కేజీఎఫ్’ మొదటి పార్ట్ లోనే ఈ మూవీని సిక్వెల్ రాబోతుందనే దర్శకుడు ప్రశాంత్ నీల్ హింట్ ఇచ్చాడు.

kgf 3 story
KGF 3 Story

ఈనేపథ్యంలో ‘కేజీఎఫ్’ సిక్వెల్ గా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి పార్ట్ చూసిన ఆడియన్స్ సెకండ్ పార్ట్ పై ఆసక్తిని కనబర్చడటంతో అడ్వాన్స్ బుకింగ్ లో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఇండియన్ రికార్డులను తిరగరాసింది. 84కోట్ల మేర అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కలెక్షన్లు రాబట్టిన ‘కేజీఎఫ్-2’ అందరిచేత ఔరా అనిపించుకుంది.

KGF Chapter 2 Twitter review: Moviegoers call film 'epic', 'unmissable', describe Yash's swag as 'unimaginable'

ఈ మూవీ కంటే ముందు ఇండియన్ రికార్డులన్నీ కూడా ఎన్టీఆర్, రాంచరణ్, జక్కన్న కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’పైనే ఉన్నాయి. మల్టిస్టారర్ మూవీగా వచ్చి ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీసును షేక్ చేసింది. ఈ మూవీ విడుదలైన రెండో వారంలో హీరో యశ్ సింగిల్ గానే కలెక్షన్లు కొల్లగొడుతున్నాడు.

KGF Chapter 2 Collections
KGF Chapter 2 Collections

‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ కలెక్షన్లను రాబతుంది. దీంతో బాక్సాఫీస్ వద్దరు ‘ఆర్ఆర్ఆర్’ వర్సెస్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ అన్నట్లు పోటీ నడుస్తోంది. ఇదిలా ఉంటే ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మూవీకి సిక్వెల్ రాబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ‘కేజీఎఫ్ 3’ స్టోరీపై అనేక ఊహగానాలు నడుస్తున్నాయి.

‘కేజీఎఫ్-3’ మూవీపై దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వకలేదు. అయితే నిర్మాతలు మాత్రం కేజీఎఫ్-3 ఉండబోతుందనే హింట్ మాత్రం ఇస్తున్నారు. దీంతో ‘కేజీఎఫ్-3’ త్వరలోనే పట్టాలెక్కడం ఖాయమనే వాదనలు విన్పిస్తున్నాయి. ఈనేపథ్యంలో సోషల్ మీడియాలో ‘కేజీఎఫ్-3’ కథకు సంబంధించిన ఓ పిక్ వైరల్ అవుతోంది.

KGF 2 4 Days Collections
KGF 2 4 Days Collections

‘కేజీఎఫ్ చాప్టర్ 2’ సినిమా చివర్లో రాఖీభాయ్ సముద్రంలో పడిపోతాడు. విలన్లు రాఖీభాయ్ ఉన్న షిప్ ను క్షిపణులతో టార్గెట్ చేశారు. సీన్ కట్ చేస్తే.. రాఖీ రక్తపు మరకల్లో సముద్రం నీళ్లలో కన్పిస్తాడు. బంగారమంతా సముద్రంలో కలిసిపోతుంది. దీంతో రాఖీబాయ్ బ్రతికి ఉంటాడని.. సబ్ మైరన్ ద్వారా గోల్డ్ ను సముద్రంలో దాచి ఉంటాడనే టాక్ విన్పిస్తోంది.

Also Read: Chiranjeevi Fans: కొరటాల శివ వల్ల ఆచార్య కి పెద్ద సమస్య.. ఆవేశం తో రగిలిపోతున్న ఫాన్స్

దీని ఆధారంగానే ‘కేజీఎఫ్ 3’ కథ ఉండబోతుందనేలి ఒక్క ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. గ్యాంగ్స్ స్టర్ ఎస్కేప్ యూజింగ్ సబ్మెరైన్ అని హెడ్ లైన్స్ తో ఈ పిక్ దర్శనమిస్తోంది. ఈ సినిమాలో 1978 నుంచి 81 వరకు ఏం చేశాడు అన్నది దర్శకుడు చూపించలేదు. ఈ సమయంలో రాఖీభాయ్ విదేశీ గనులను ఆక్రమించుకున్న క్రిమిన్స్ పని పడుతాడని తెలుస్తోంది.

ఈక్రమంలోనే కేజీఎఫ్ 3 స్టోరీ విదేశాల్లో స్టాట్ అవుతుందనే టాక్ విన్పిస్తోంది. ఏదిఏమైనా ‘కేజీఎఫ్ 2’ ను మించేలా ‘కేజీఎఫ్ 3’ కథ ఉండబోతుందనే మాత్రం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. దీంతో ‘కేజీఎఫ్ 3’ స్టోరీని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలా తీర్చిదిద్దుతారనే ఉత్కంఠ మాత్రం ‘రాఖీభాయ్’ అభిమానుల్లో నెలకొంది.

Also Read: Shruti Haasan: ప్రైవేట్ పార్ట్స్ సర్జరీల ‘శ్రుతి హాసన్’ క్లారిటీ.. మరి ఎఫైర్లు సంగతి ?

Recommended Videos:

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

  1. […] Gemini TV Anchors: 80వ దశకంలో జెమినీ టీవీ ప్రారంభం అయిన విషయం అందరికి తెలుసు. టీవీతో పాటు శాటిలైట్ ప్రారంభం కూడా అదే సంవత్సరమే జరిగింది. అప్పట్లో వేరే ఛానల్స్ లేకపోవడంతో ఇందులో పనిచేసే యాంకర్స్ కు మంచి ఆధరణ ఉండేది. ఇప్పటికి ఛానల్ ప్రారంభించి 31 సంవత్సరం అయింది. అంటే మూడు దశాబ్దాలు అన్నమాట. అప్పుడు యాంకర్స్ గా కేరీర్ ప్రారంభించిన వాళ్లలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రస్తుతం యాంకర్స్ గా కొనసాగుతున్నారు. కేవలం 5 నుండి 6గురు యాంకర్స్ మాత్రమే జెమినీలో సేవలందిస్తున్నారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular