Naga Chaitanya-Sobhita
Naga Chaitanya – Shobhita : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగేశ్వరరావు, నాగార్జున స్టార్ హీరోలుగా వెలుగొందితే మూడోతరం హీరోలుగా వచ్చిన నాగచైతన్య(Naga Chaithanya), అఖిల్ (Akhil) మాత్రం భారీ విజయాలను అందుకోవడంలో కొంతవరకు వెనుకబడిపోయారనే చెప్పాలి. ఎందుకంటే వీళ్లు చేస్తున్న ప్రతి సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించడం లేదు. కాబట్టి ఈ సినిమాతో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ హీరోలు తమకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంది. తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ భారీ విజయాలను అందుకుంటున్న మిగతా హీరోలందరు ముందుకు దూసుకెళ్తుంటే ఈ హీరోలు మాత్రం చాలా వరకు వెనుకబడి పోతున్నారు… ఇక వీళ్ళు మంచి కథలతో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక రీసెంట్ గా తండేల్ (Thandel) సినిమాతో నాగచైతన్య కొంతవరకు పర్లేదు అనిపించుకున్నప్పటికి భారీ విజయాన్ని సాధించడంలో మాత్రం ఫెయిల్ అయిపోయాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా నాగచైతన్యకు పెళ్లయిన విషయం మనకు తెలిసిందే. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను రెండో వివాహం చేసుకున్నాడు.
ప్రస్తుతం ఆమె సినిమాలేమి చేయకుండా ఖాళీగా ఉంటుంది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆమె సినిమా రంగంలో మరోసారి ఎంట్రీ ఇవ్వాలని ఆసక్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఆమె నిర్ణయాన్ని నాగ చైతన్య ఒప్పుకున్నాడా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇక ఇప్పటికే ఈమెకు బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లైతే వస్తున్నాయి. ఆమె కూడా సినిమాల్లో నటించాలని ఆసక్తి చూపిస్తుందట. మరి నాగచైతన్య నాగార్జునలు ఈ విషయం మీద ఎలా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇంతకుముందు సమంత(Samantha)కూడా పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం వల్లే నాగ చైతన్య తనకు విడాకులు ఇచ్చాడనే వార్తలైతే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ఇప్పుడు శోభిత ధూళిపాళ్ల కూడా అలాగే చేస్తుందా? అక్కినేని ఫ్యామిలీ కోడలు అంటే చాలా పద్ధతిగా ఇంట్లోనే ఉండాల్సిన అవసరమైతే ఉంది.
కానీ శోభిత మాత్రం మళ్ళీ సినిమాలంటూ ముందుకెళ్తే నాగచైతన్య, శోభితల మధ్య కొంతవరకు గ్యాప్ అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా వీళ్ల మధ్య ఉన్న బాండింగ్ అలాగే ఉంటుందా లేదంటే ఆమె మళ్ళీ సినిమాలు చేయడం వల్ల ఏమైనా తేడా కొట్టే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…