Raja Saab Song Trolls: సౌత్ ఇండియా లో ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్స్ లో టాప్ 2 లిస్ట్ తీస్తే మన అందరికీ గుర్తుకు వచ్చే పేర్లు తమన్(SS Thaman), అనిరుద్(Anirudh Ravichander). ఒకేసారి నాలుగైదు సినిమాలకు సంగీతం అందించేంత బిజీ గా ఉన్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్ళే. ఈమధ్యనే తమన్ ‘ఓజీ’ చిత్రం మ్యూజిక్ తో సౌత్ ని ఒక ఊపు ఊపేసాడు. ఈ సినిమాని మ్యూజిక్ కేవలం సౌత్ కి మాత్రమే పరిమితం కాలేదు, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఇన్ స్టాగ్రామ్ లో అయితే ఓజీ మ్యూజిక్ ని అటాచ్ చేయకుండా ఒక్క నెటిజెన్ కూడా పోస్టులు పెట్టడం లేదు, ఆ రేంజ్ లో వైరల్ అయ్యింది. ఒక్క మాట లో చెప్పాలంటే అనిరుద్ ని డామినేట్ చేసాడు తమన్. అయితే తమన్ శకం ఓజీ చిత్రం తోనే ముగిసిపోయిందా?, రాబోయే రోజుల్లో తమన్ నుండి ఓజీ రేంజ్ మ్యూజిక్ ని ఆశించలేమా అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఎందుకంటే రీసెంట్ గానే ఆయన సంగీతం అందించిన అఖండ 2 , రాజా సాబ్ పాటలు విడుదలయ్యాయి. అఖండ 2 నుండి పాటలు, ఒక ట్రైలర్ వచ్చింది. వీటిల్లో ఆయన మ్యూజిక్ ఎలాంటి ప్రభావం చూపలేదు. అఖండ చిత్రం అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి తమన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ సీక్వెల్ లో ఆయన అందించిన మ్యూజిక్ చాలా లైట్ అని అనిపించింది. సినిమాలో కూడా ఇదే రేంజ్ మ్యూజిక్ ఉంటే మాత్రం కష్టమే. ఇక తమన్ మ్యూజిక్ అందించిన ‘రాజా సాబ్’ నుండి నిన్న మొదటి లిరికల్ వీడియో సాంగ్ వచ్చింది. ఇది అయితే ఇంకా దారుణం, కనీసం అభిమానులు కూడా రెండవ సారి వినే రేంజ్ లో లేదు ఆ పాట, అంత దారుణమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
ఇవంతా చూస్తుంటే తమన్ పని ఇక అయిపోయినట్టే అని అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ సాయి అభయంకర్ కి తెలుగు, తమిళ భాషల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. రీసెంట్ గానే ఆయన డ్యూడ్ చిత్రం తో మ్యూజిక్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఎక్కడ చూసినా ఇప్పుడు డ్యూడ్ మూవీ పాటలే వినిపిస్తున్నాయి. అంతలా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ చిత్రానికి పని చేస్తున్నాడు. ఈ సినిమా విడుదలయ్యాక ఇక తమన్ కి అవకాశాలు రావడం కష్టమే. సాయి అభయంకర్ బిజీ గా ఉండడం వల్ల మిస్ అయ్యే సినిమాలు మాత్రమే తమన్ కి రావొచ్చు, రాబోయే రోజుల్లో తమన్ పరిస్థితి ఇలా ఉండే అవకాశాలు ఉన్నాయి.