Kolaveri Song: కొలవెరీ పాట గుర్తుందా.. ఈ పాట వల్లే సినిమా ఫ్లాప్ అయిందా?

యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. 3 సినిమా అనేకంటే ఈపాట పేరు చెబితే హో ఆ సినిమానా అంటారు. అయితే ఈ చార్ట్ బస్టర్ సాంగ్ సినిమా విజయానికి మాత్రం అంతగా ఉపయోగపడలేదు.

Written By: Swathi Chilukuri, Updated On : February 13, 2024 4:23 pm

Kolaveri Song

Follow us on

Kolaveri Song: సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలిగా అవతారమెత్తిన సంగతి తెలిసిందే. ఈమె 3 అనే సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయింది. ఇందులో ఆమె మాజీ భర్త ధనుష్, శృతి హాసన్ హీరోహీరోయిన్ లుగా నటించారు. 2012లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా కోసం రాక్ స్టార్ అనిరుధ్ కంపోజ్ చేసిన వై దిస్ కొలవెరి పాట ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఓ ఊపు ఊపింది.

యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. 3 సినిమా అనేకంటే ఈపాట పేరు చెబితే హో ఆ సినిమానా అంటారు. అయితే ఈ చార్ట్ బస్టర్ సాంగ్ సినిమా విజయానికి మాత్రం అంతగా ఉపయోగపడలేదు. ఇదే విషయం తాజాగా ఐశ్వర్య మాట్లాడింది. లాల్ సలాం ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 3 సినిమా పరాజయంపై ఐశ్వర్య రజనీకాంత్ స్పందించారు.

వై దిస్ కొలవెరి పాట అంత పెద్ద సక్సెస్ అవడం సినిమా కంటెంట్ మీద ప్రభావం చూపిందని తెలిపింది ఐశ్వర్య. అయితే కంటెంట్ సీరియస్ గా సాగుతుందని.. కానీ ఈ పాట సినిమాపై భిన్నమైన అంచనాలను నెలకొల్పిందని చెప్పింది. పాటను విన్న వారంతా డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్స్ కు వచ్చారు. దీంతో సినిమా వాళ్ళకి నచ్చలేదు. రీ రిలీజ్ లో 3 సినిమాకు మంచి ఆదరణ లభించడానికి కారణం అప్పటికీ ఆ పాట మ్యాజిక్ తగ్గకపోవడమే అని ఆమె చెప్పారు.

అయితే ఈ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కెరీర్ కు ఎంతగానో ఉపయోగ పడినందుకు తాను సంతోషంగా ఉన్నానని తెలిపింది. ఇదిలా ఉంటే ఐశ్వర్య రజనీకాంత్ దాదాపు 9 సంవత్సరాల తర్వాత లాల్ సలాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రజనీకాంత్ స్పెషల్ రోల్ లో నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ అతిథి పాత్రలో కనిపించారు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా మిశ్రమ ఫలితాలను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా తమిళ్ లో మంచి వసూల్లు రాబడుతోంది. కానీ తెలుగు ప్రేక్షకులను మాత్రం నిరాశపరిచింది.