Nepal Next PM: నేపాల్(Nepal) లో జరుగుతున్న అల్లర్లను మనం ప్రతీ రోజు టీవీ లో చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా ని బ్యాన్ చేయడం తో జనరేషన్ Z కుర్రాళ్ళు రోడ్డు మీదకొచ్చి నిరసనలు వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. దీంతో నేపాల్ ప్రైమ్ మినిస్టర్ KP శర్మ(KP sharma) ఆందోళనకారులను అవసరమైతే షూట్ చేయమని ఆదేశాలు జారీ చేసాడు. దీంతో పోలీసులు రెచ్చిపోవడం తో దాదాపుగా 20 మందికి పైగా యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం అధికారిక లెక్కల్లో రిజిస్టర్ అయ్యింది మాత్రమే. అనధికారికంగా 40 మందికి పైగానే చనిపోయినట్టు తెలుస్తుంది. దీంతో కన్నెర్ర చేసిన యువ పార్లమెంట్ ని కాల్చేయడం, ప్రధాని మంత్రి ఇంటిని ద్వంసం చేయడం, ఆర్ధిక మంత్రిని రోడ్డు మీద పరుగులు తీయించి కొట్టడం,ఇలా చాలానే జరిగాయి. దెబ్బకి నేపాల్ సిస్టం మొత్తం అస్తవ్యస్తం అయ్యింది. సోషల్ మీడియా పై బ్యాన్ ఎత్తేస్తాము, శాంతించండి అంటూ ప్రభుత్వం చెప్పినపప్పటికి కూడా అల్లర్లు ఆగలేదు.
అక్కడి ప్రభుత్వం వెంటనే దిగిపోయేంత వరకు ఈ ఉద్యమం ఆగదు అంటూ బలంగా డిమాండ్ చేశారు. పరిస్థితులు చెయ్యి దాటిపోవడం తో, నేపాల్ ఆర్మీ ప్రధాని KP శర్మ ని రాజీనామా చేయమని చెప్పడం తో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేసాడు. ఇప్పుడు నేపాల్ కి కొత్త ప్రధాని గా ఖాట్మాండు మేయర్ బాలేంద్ర ని ప్రధాన మంత్రి ని చేసే ఆలోచనలో ఉన్నట్టు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం. ఒకప్పుడు ర్యాప్ సింగర్ గా యూత్ లో ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. కుర్ర వయస్సులోనే రాజకీయ అరంగేట్రం చేసి ఖాట్మాండు మేయర్ గా మంచిగానే పరిపాలించాడు. అయితే ఈయన మేయర్ గా ఉంటున్న సమయం లో ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం నేపాల్ లో విడుదలైంది. ఈ సినిమాపై అప్పట్లో బాలేంద్ర(Balendra) సంచలన వ్యాఖ్యలు చేయడం పెద్ద సంచలనం గా మారింది.
అప్పట్లో ఆయన మాట్లాడుతూ ‘రీసెంట్ గానే ఇండియన్ మూవీ ఆదిపురుష్ చిత్రాన్ని చూసాను. ఇందులో సీతమ్మ ఇండియా లో పుట్టినట్టు చూపించారు. అది ముమ్మాటికీ అబద్దం, సీత పుట్టింది నేపాల్ గడ్డ మీద. సినిమాలో వక్రీకరించి చూపించాడు. మూడు రోజులలో ఆ సన్నివేశాలను తొలగించాలి’ అంటూ హెచ్చరికలు జారీ చేసాడు. అప్పటి నుండి కేవలం ఆదిపురుష్ సినిమానే కాదు, ఇండియన్ మూవీస్ పైన కూడా ఖాట్మాండు లో బ్యాన్ చేసాడు. అలాంటి బాలేంద్ర ఇప్పుడు ప్రధాని కాబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు నేపాల్ లో ఎలాంటి నిషేధం లేదు, హై కోర్టు ఈ నిషేధాన్ని కొట్టి పారేసింది