Homeఎంటర్టైన్మెంట్Komaram Bheem Song: 'కొమురం భీముడో ' వీడియో సాంగ్ ని అందుకే విడుదల చెయ్యలేదా??

Komaram Bheem Song: ‘కొమురం భీముడో ‘ వీడియో సాంగ్ ని అందుకే విడుదల చెయ్యలేదా??

Komaram Bheem Song: #RRR సినిమా నేటికీ విడుదల అయ్యి 30 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికి బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మాత్రం జోరు తగ్గలేదు..KGF లాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ పోటీగా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడినప్పటికీ కూడా #RRR డీసెంట్ వసూళ్లను సాధిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర తన బ్రాండ్ ఎలాంటిదో చూపించింది..ప్రతిష్టాత్మక వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ఈ సినిమా ఇటీవలే 1100 కోట్ల రూపాయిల మార్కుని కూడా అందుకుంది..లేటెస్ట్ రిలీజ్ జెర్సీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ పెర్ఫార్మన్స్ ఇస్తుండడం తో ఆ సినిమాకి కేటాయించిన షోస్ లో సగం మళ్ళీ #RRR కి ఇస్తున్నారట బాలీవుడ్ లో..కాబట్టి ఈ వీకెండ్ కూడా ఈ సినిమాకి అక్కడ డీసెంట్ వసూళ్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది..తెలుగు లో ఇప్పటికి ప్రతి ప్రాంతం నుండి ఈ సినిమాకి డైలీ షేర్స్ వస్తూనే ఉన్నాయి అంటే ఈ సినిమా లాంగ్ రన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు.

Komaram Bheem Song
Komaram Bheem Song

సినిమా విడుదల అయ్యి చాలా రోజులు అవుతూ ఉండడం తో ఈ మూవీ కి సంబంధించిన వీడియో సాంగ్స్ ని ఒక్కొక్కటిగా వదులుతూ ఉంది ఆ చిత్ర బృందం..ఇటీవలే నాటు నాటు , దోస్తీ మరియు కొమ్మ ఉయ్యాలా వంటి పాటలను వదలగా వాటికి యూట్యూబ్ లో అద్భుతమైన వ్యూస్ వచ్చాయి..ముఖ్యంగా నాటు నాటు సాంగ్ దేశ వ్యాప్తంగా అన్నీ బాషలలో ఎలా హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..కేవలం ఈ పాట కోసం సినిమాని రెండు మూడు సార్లు థియేటర్స్ కి వెళ్లి చూసిన ఆడియన్స్ సంఖ్య ఎక్కువే..ఈ పాట తర్వాత ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకున్న పాట కొమురం భీముడొ సాంగ్..ఎన్టీఆర్ తన నట విశ్వరూపం మొత్తం ఈ ఒక్క పాటలో చూపించాడు అనే చెప్పాలి..ఈ సాంగ్ లో ఎన్టీఆర్ చూపించిన హావభావాలు చూసి ఇలాంటివారికి అయినా కంటతడి రాక తప్పదు..సినిమాకి ఆయువు పట్టు లాగ ఉన్న ఈ పాట వీడియో సాంగ్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Also Read: Samantha Sweet Warning To Naga Chaitanya: నాగ చైతన్య కి సమంత స్వీట్ వార్నింగ్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ట్వీట్

కానీ బాక్స్ ఆఫీస్ మైలేజి కోసం ఈ పాటని కొన్ని రోజుల పాటు విడుదల చెయ్యకుండా ఉంచాలి అని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది అట..ఫామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకర్షిస్తున్న పాట ఇప్పుడే యూట్యూబ్ లో వదిలేస్తే కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది అని మూవీ యూనిట్ ఉద్దేశ్యం అట..ఈ సాంగ్ తో పాటు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి సంబంధించిన కొన్ని వీడియోస్ విడుదల చెయ్యబోతున్నారు అట..చితం నిడివి ఎక్కువగా ఉండడం వాళ్ళ కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ లో తొలగించారు అని..ఇప్పుడు ఆ సన్నివేశాలు అన్నీ యూట్యూబ్ లో త్వరలోనే విడుదల చెయ్యబోతున్నారు అని టాక్ వినిపిస్తుంది..బాక్స్ ఆఫీస్ వద్ద 1100 కోట్ల రూపాయిలు వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో మరో 50 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ పండితుల అంచనా.

Also Read: KCR vs Governor: కేసీఆర్ వర్సెస్ గవర్నర్: అగ్నికి ఆజ్యం పోస్తున్న అసదుద్దీన్?

Recommended Videos:

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular