Pavan Kalyan- Bandla Ganesh: ఒక్క చిన్న కమెడియన్ గా కెరీర్ ని ప్రారంబించి టాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఒకడిగా మారిన వ్యక్తి బండ్ల గణేష్..ఇతను ఒక కమెడియన్ గా నిర్మాతగా కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ భక్తుడిగానే మనకి బాగా తెలుసు..పవన్ కళ్యాణ్ అనే పేరు ఎత్తితే పూనకాలు వచ్చి ఊగిపోయ్యే బండ్ల గణేష్ ప్రసంగాలకు సోషల్ మీడియా లో మంచి క్రేజ్ ఉంది..ఆంజనేయులు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి నిర్మాతగా పరిచయమైనా బండ్ల గణేష్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో తీన్మార్ సినిమా చేసాడు..ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా ఫ్లాప్ గా నిలిచాయి..అలాంటి సమయం లో పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ కి పిలిచిమరీ గబ్బర్ సింగ్ సినిమాని నిర్మించే అవకాశం ఇచ్చాడు..ఈ సినిమా అప్పట్లో ఇంతపెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..10 ఏళ్ళ క్రితమే ఈ సినిమా 65 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఈ ఒక్క సినిమా వల్ల బండ్ల గణేష్ కెరీర్ రాత్రికి రాత్రే అనూహ్యమైన మలుపు తిరిగింది..స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకడిగా నిలిచి ఎన్టీఆర్ , రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసేంత స్థాయికి చేరాడు..తనకి ఇంత గొప్ప జీవితం ని ఇచ్చాడు కాబట్టే పవన్ కళ్యాణ్ ని బండ్ల గణేష్ ఒక దేవుడిలాగా భావిస్తాడు.

Also Read: Atmakuru By-Election Campaign Over: ముగిసిన ప్రచార ఘట్టం…ఆత్మకూరులో వార్ వన్ సైడేనా?
సమయం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడే బండ్ల గణేష్ ఇటీవల ట్విట్టర్ లో పెట్టిన ఒక ఆడియో పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఆ ఆడియో లో ఆయన ఏమి మాట్లాడాడు అంటే ‘జీవితం లో తల్లి తండ్రులు, పెళ్ళాం బిడ్డలను తప్ప ఎవరిని నమోద్దు..వీళ్ళనే నీ ప్రపంచం లాగ చూసుకోవాలి..ఎందుకంటే వీళ్ళే నీకు నీ జీవిత ప్రయాణం లో చివరి వరుకు తోడు ఉండేది’ అంటూ చెప్పుకొచ్చాడు..ఈ ఆడియో నోట్ లో ఆయన దేవుడిలా భావించే పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు..పవన్ కళ్యాణ్ ఆయనని దూరం పెట్టాడనే కారణం చేతనే బండ్ల గణేష్ మనసు విరిగిన వాడిలాగా ఇలా పోస్ట్లు పెడుతున్నాడని సోషల్ మీడియా లో గుసగుసలు వినిపిస్తున్నాయి..ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తనని పవన్ కళ్యాణ్ ని కావాలనీయకుండా అడ్డుపడుతున్నాడని..భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి కూడా నాకు ఆహ్వాన పత్రిక రానివ్వకుండా చేసాడని..బండ్ల గణేష్ ఒక పవన్ కళ్యాణ్ అభిమాని తో జరిపిన ఒక్క సంభాషణ అప్పట్లో తెగ వైరల్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సినిమాలు అన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ చూసుకుంటూ వస్తున్నాడు..ఏ డైరెక్టర్ అయినా పవన్ కళ్యాణ్ కి స్టోరీ చెప్పాలంటే ముందుగా త్రివిక్రమ్ అనుమతి తీసుకోవాల్సిందే..ఇది బండ్ల గణేష్ కి అసలు నచ్చట్లేదట..అందుకే పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ మధ్య ఇటీవల కాలం లో చాల గ్యాప్ ఏర్పడింది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

Also Read: Chandrababu-NTR Family: ఏకతాటిపై ఎన్టీఆర్ కుటుంబం.. ఆ ఒక్కరు తప్ప.. చంద్రబాబు భారీ స్కెచ్




[…] […]
[…] […]