https://oktelugu.com/

Varun Tej- Lavanya Tripathi Marriage: లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ ని కలిపింది ఆ అమ్మాయేనా..? వీళ్ళ లవ్ స్టోరీ వెనుక ఇంత ఉందా!

కానీ ఎప్పుడైతే లావణ్య త్రిపాఠి వాటిల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చిందో, అప్పటి నుండి వీళ్ళ మధ్య ఏమి లేదని నమ్మే వాళ్ళు ఉన్నారు,నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : June 2, 2023 / 07:55 AM IST

    Varun Tej- Lavanya Tripathi Marriage

    Follow us on

    Varun Tej- Lavanya Tripathi Marriage: సోషల్ మీడియా లో చాలా కాలం నుండి లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ ప్రేమ వ్యవహారం గురించి ఎన్నో వేల వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, వీళ్ళ పెళ్ళికి కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని , ఇలా ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి.

    కానీ ఎప్పుడైతే లావణ్య త్రిపాఠి వాటిల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చిందో, అప్పటి నుండి వీళ్ళ మధ్య ఏమి లేదని నమ్మే వాళ్ళు ఉన్నారు,నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ గాసిప్ రాయుళ్లు మాత్రం వీళ్ళు ఇప్పటికీ ప్రేమించుకుంటున్నారనే రాసేవాళ్ళు. చివరికి వాళ్ళు రాసిందే నిజం అయ్యింది. ఈ నెల 9 వ తారీఖున హైదరాబాద్ లో ఈ క్యూట్ జంట నిశ్చితార్థం చేసుకోబోతుంది. ఈ విషయం దాదాపుగా అధికారికంగా ఖారారు అయ్యినట్టే, వరుణ్ తేజ్ ఏ క్షణం అయినా దీని గురించి సోషల్ మీడియా లో అధికారిక ప్రకటన చెయ్యబోతున్నాడు.

    ఇకపోతే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కి ‘మిస్టర్’ సినిమా ద్వారా పరిచయం అయ్యిందని అందరూ అనుకున్నారు. వీళ్లిద్దరి లవ్ స్టోరీ ఇక్కడి నుండే మొదలైందని మనకి అనిపించొచ్చు. కానీ వీళ్ళ మధ్య పరిచయం ‘మిస్టర్’ చిత్రం ముందే ఏర్పడింది. లావణ్య త్రిపాఠి వరుజ్ తేజ్ సోదరి నిహారిక కొణిదెల కి బెస్ట్ ఫ్రెండ్. వీల్లద్దరి మధ్య స్నేహం జిమ్ లో ఏర్పడింది. లావణ్య త్రిపాఠిని నిహారిక తరచూ తన ఇంటికి తీసుకెళ్తూ ఉండేది.

    అలా వరుణ్ తేజ్ తో స్నేహం ఏర్పడింది. వీళ్లిద్దరు కలిసి డిన్నర్స్ కి వెళ్ళేవాళ్ళు, డేట్స్ కి వెళ్ళేవాళ్ళు కూడా. అలా వీళ్ళ మధ్య ప్రేమ ‘మిస్టర్’ సినిమాకి ముందే ఏర్పడింది. ఇన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత ఇప్పుడు వీళ్లిద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇదంతా నిహారిక తో లావణ్య స్నేహం చెయ్యడం వల్లే జరిగింది కాబట్టి, వీళ్లిద్దరి ప్రేమకు మూల కారణం నిహారిక కొణిదెల అని అంటున్నారు ఫ్యాన్స్.
    Recommended Video: