Anasuya Bharadwaj: జబర్దస్త్ ద్వారా ఫేమ్, నేమ్ సంపాదించిన యాంకర్ అనసూయ. కేవలం యాంకర్ గా నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాల్లో ఇరగదీస్తుంది. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తన రేంజ్ ను పెంచుకుంటుంది అనసూయ. ఇక షోలు, సినిమాలే కాదు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. ఆంటి అనే టాపిక్ తో వార్తల్లో నిలిచిన అను ఇప్పుడు వరుసగా వార్తల్లో నిలుస్తోంది. అయితే గతంలోనే ఓ సినిమాలో మంచి ఛాన్స్ వచ్చిందట. అందులో చేయకపోవడానికి గల కారణాలను వివరించింది ఈ అమ్మడు.
సమంత, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ ను కొల్లగొట్టింది ఈ సినిమా. అయితే ఇదే సినిమాలో అనసూయకు ఛాన్స్ వచ్చిందట. కానీ ఈ సినిమాలో వచ్చిన ఒక పాటలో డాన్స్ చేయాలని చెప్పగా… అందులో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారని చేయనని చెప్పిందట అనసూయ. గుంపులో ఒకరిగా నటించడం నచ్చదని.. నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను అని తెలిపింది. అందుకే పాటకు నో చెప్పిందట. కానీ ఆ అవకాశాన్ని తిరస్కరించినందుకు చాలా మంది విమర్శించారట. అప్పుడు నో చెప్పడం తప్పు కాదని.. కానీ చెప్పే విధానం తప్పేమో అని అనిపించిందట.
మొదటి నుంచి ముక్కుసూటి మనిషిని అందుకే కొంచెం కఠినంగా చెప్పాను. అందులో నటించనందుకు ట్విట్టర్ లో పెద్ద వార్ జరిగింది. అందుకే త్రివిక్రమ్ కు సారీ కూడా చెప్పాను అని తెలిపింది అనసూయ. ఇక సినిమా షూటింగ్స్ జరిగినప్పుడు తన పని తాను చూసుకొని వెళ్లిపోతుందట.. సినిమా తర్వాత జరిగే పార్టీలకు చాలా దూరంగా ఉంటుంది. ఈ కారణం వల్లనే హీరోయిన్ అవకాశం కూడా కోల్పోయాను. కానీ పార్టీల వల్ల అవకాశాలు వస్తాయంటే నేను వాటిని ప్రోత్సహించను అని తేల్చి చెప్పింది అను. ఇలా మొత్తం మీద తను చేసిన తప్పును ఒప్పుకోవడమే కాదు హీరోయిన్ గా ఎందుకు ఎదగలేదో కూడా తెలిపింది అనసూయ.