Allu Arjun And Ram Charan: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ జనరేషన్ హీరో అయిన రామ్ చరణ్ తనదైన రీతిలో సక్సెస్ లు అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు ఇక ఇదే క్రమం లో మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకొని ఇండస్ట్రీకి వచ్చిన అల్లు అర్జున్ కూడా మంచి విజయాలను అందుకొని పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరూ కూడా స్టార్ హోదాని అనుభవిస్తున్నారు.
అయితే అల్లు అర్జున్ ఒకప్పుడు అల్లు ఫ్యామిలీ పేరు తీసుకురాకుండా కేవలం మెగా ఫ్యామిలీ అనే పేరు కిందనే చలామణి అయ్యేవాడు అయితే ఒకసారి తనకు స్టార్ట్ డమ్ రావడంతో మెగా ఫ్యామిలీని పక్కన పెట్టి అల్లు అర్జున్ ఫ్యామిలీని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇది తెలిసిన మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా అల్లు అర్జున్ పైన ఇప్పటికే విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ కి అల్లు అర్జున్ కి మధ్య తేడా ఏంటి అని చాలామంది అడుగుతున్నారు సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు కూడా చేస్తున్నారు. నిజానికి రాంచరణ్ హిట్ వచ్చిన ఫ్లాప్ వచ్చిన పెద్దగా పొంగిపోడు సెలబ్రేషన్స్ ని పెద్దగా పట్టించుకోడు. చిరంజీవి ఎలాగైతే ఉన్నత శిఖరాలను అధిరోహించిన కూడా చాలా కామ్ గా ఉంటాడో రామ్ చరణ్ కూడా అలాగే ఉంటాడు కానీ అల్లు అర్జున్ అలా కాదు చిన్నపాటి హిట్ వచ్చిన భారీ హైప్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తూ ఉంటాడు అని మెగా ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ మీద ఫైర్ అవుతున్నారు.
ఇక వీళ్ళిద్దరికీ మధ్య సినిమాలపరంగా మంచి పోటీ ఉన్నప్పటికీ ఎవరు ఎవరి పైన పైచేయి సాధిస్తారు అనేది మాత్రం ఎవరికీ తెలియడం లేదు. ఒక సినిమాతో ఒక హీరో పై చేయి సాధిస్తే మరొక సినిమాతో మరొక హీరో పై చేయి సాదిస్తున్నాడు కాబట్టి ఇద్దరు కూడా ఇండస్ట్రీలో సమానమైన హీరోలు గా కొనసాగుతున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం అల్లు ఆర్మీ, అల్లు ఫ్యామిలీ అని వాళ్ళ ఫ్యామిలీని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ, మెగా ఫ్యామిలీ గురించి అసలు చెప్పకపోవడం చూసిన మెగా అభిమానులు అందరూ కూడా అతని మీద కొంతవరకు సీరియస్ అవుతున్నారు…