Tamannaah – Vijay Varma : గత కొంత కాలం నుండి సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ తమన్నా ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ తో ప్రేమాయణం నడుపుతుందని, ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని , త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి.విజయ్ అంటే న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన MCA సినిమా గుర్తుంది కదా, అందులో మెయిన్ విలన్ గా నటించిన అతనే విజయ్ అంటే.
రీసెంట్ గా ఈయన తమన్నా తో చెట్టపట్టాలు వేసుకొని తిరగడం హాట్ న్యూస్ అయిపోయింది. ఇక రీసెంట్ గా సోషల్ మీడియా లో వీళ్లిద్దరి రొమాంటిక్ చాట్ చూసి నెటిజెన్స్ పెళ్ళెప్పుడు ఇక అని అడుగుతున్నారు.తమన్నా ని సౌత్ ఇండియా మొత్తం మీద ఉన్న కోట్లాది మంది కుర్రాళ్ళు ఎంతగానో ఇష్టపడుతున్నారు, అలాంటి అమ్మాయి నీ సొంతం కాబోతుంది అంటూ విజయ్ ట్వీట్స్ క్రింద కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఒకటి దాగుంది. వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నట్టు మనకి కావాలని నమ్మిస్తున్నారట, అందుకు కారణం వీళ్లిద్దరూ కలిసి లేటెస్ట్ గా ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో నటించారు. ఆ సినిమా ప్రొమోషన్స్ కోసమే, వీళ్లిద్దరు ఇలా నాటకాలు ఆడుతున్నారని కొంతమంది నెటిజెన్స్ అంటున్నారు.
అయితే కొంతమంది మాత్రం అలాంటిదేమి లేదని, నిజంగానే వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారని, ఒకవేళ వీళ్ళు ప్రేమలో లేకపోతే, న్యూ ఇయర్ రోజు లవర్స్ అందరూ కలిసి ఉన్న చోట వీళ్లేందుకు కనిపిస్తారని, అక్కడ ఎందుకు ముద్దులు పెట్టుకుంటారని అంటున్నారు. మొత్తానికి నిన్న మొన్నటి వరకు తమన్నా మరియు విజయ్ ప్రేమికులు అని అనుకున్న అందరికీ ఇప్పుడు వీళ్ళు సినిమా కోసం చేసారా, లేదా నిజంగానే ప్రేమికులా? అనే కన్ఫ్యూజన్ లో అభిమానులను పడేసారు.