OG Movie Director Sujeeth: తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది దర్శకులు పాన్ ఇండియా బాట పట్టిన విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో మొదటి అడుగు వేశాడు. ఆయన సూపర్ సక్సెస్ అవ్వడంతో అతని బాటలో సుకుమార్, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులు వచ్చి భారీ సక్సెస్ లను సాధించారు. మరి ఇప్పటివరకు ఎవరి ఎలాంటి సినిమాలను చేసినా కూడా కొంతమంది యంగ్ డైరెక్టర్లు సైతం పాన్ ఇండియా సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు. ఇక అందులో సుజిత్ కూడా ఒకడు కావడం విశేషం…బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ ఇమేజ్ తారాస్థాయికి వెళ్లిపోయింది. ఇక అదే సమయంలో సుజిత్ ప్రభాస్ తో సాహో సినిమా చేసి భారీ ప్లాప్ ని మూటగట్టుకున్నాడు.మరి ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ తో ఓజి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని పాన్ ఇండియాలో తనకంటూ ఒక సపరేట్ మార్కెట్ ని క్రియేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…
ఇప్పటివరకు ఆయన చేసినవి రెండు సినిమాలే అయినప్పటికి ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పది సంవత్సరాలు పూర్తవుతోంది. మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించి తన మార్కెట్ ను పెంచుకోవడమే కాకుండా మరోసారి మరో స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
కెరియర్ మొదట్లోనే స్టార్ట్ హీరోతో సినిమాలు చేసే అవకాశం రావడం అనేది కూడా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. రన్ రాజా రన్ సినిమా తర్వాత ఆయనకు ప్రభాస్ తో అవకాశం రావడం దానికోసం ఐదు సంవత్సరాలు వేచి చూడడం చాలా చాలా జరిగిపోయాయి. మరి ఇప్పుడు ఓజీ సినిమా విషయంలో కూడా ఆయన దాదాపు 5 సంవత్సరాలుగా ఈ సినిమా మీదనే ఉన్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.
రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ ల పక్కన తన పేరు కూడా నిలుపుకుంటాడా? లేదా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది… తను ఒకసారి పాన్ ఇండియాలో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటే ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరు అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే అవకాశాలైతే ఉన్నాయి…చూడాలి మరి సుజీత్ ఈ మూవీ తో ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తాడు అనేది…