Sandeep Reddy Vanga Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కించిన దర్శకులలో సందీప్ రెడ్డి వంగ ఒకరు… అర్జున్ రెడ్డి సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేశాడు. అలాంటి దర్శకుడు ఆ తర్వాత చేసిన అనిమల్ సినిమాతో ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేసుకున్నాడు. తన సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూసే రేంజ్ లో హైప్ నైతే క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు చేస్తున్న స్పిరిట్ సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో నటించడానికి స్టార్ హీరోలందరు పోటీపడుతున్న నేపథ్యంలో స్పిరిట్ సినిమా రిజల్ట్ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా స్పిరిట్ సినిమా కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు సందీప్ రెడ్డి వంగ వెనుకబడే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలు సైతం సందీప్ తో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యారు…
రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ సైతం సందీప్ తో కథ చర్చలు జరిపినట్టుగా తెలుస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న స్టార్ హీరోలు సందీప్ తో వాళ్ల కెరియర్ లో ఒక్క సినిమా అయిన చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి సందీప్ రెడ్డి వంగ ఇక మీదట రాబోయే సినిమాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది.
ప్రతి సినిమాలో హీరో కోపంతో ఉండటం, బోల్డ్ సీన్స్ లతో మూవీని చేయడం లాంటి వాటిని ప్రతి సినిమాలో చేస్తాను అంటే కుదరదు. తను కూడా తన హీరో క్యారెక్టర్జేషన్స్ ను చాలా వరకు మార్చుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక కథల విషయంలో సైతం ఆయన చాలా క్లారిటీని మెయింటైన్ చేయాలి. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ మీద పూర్తిస్థాయిలో నెగెటివిటి ఉంది.
ఒక్కసారి కనక ఆయన ఒక ఫ్లాప్ సినిమాను తీస్తే మాత్రం మీడియా మొత్తం అతని మీద నెగెటివిటి స్ప్రెడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన నుంచి ఫ్లాప్ సినిమా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే బాగుంటుంది. లేకపోతే మాత్రం ఆయన కెరియర్ కి చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలైతే ఉన్నాయి…