Spirit: స్పిరిట్ మూవీ స్టోరీ ని సందీప్ హాలీవుడ్ నుంచి కాపీ చేస్తున్నాడా..?

కొంతమంది సందీప్ అభిమానులు మాత్రం సందీప్ కి రీమేక్ లను ఎంకరేజ్ చేయడు తన సొంత స్క్రిప్ట్ తోనే వెళ్తాడు, ఎవరిని కాపీ చేయాల్సిన అవసరం తనకు లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Written By: Gopi, Updated On : January 17, 2024 11:26 am

Spirit

Follow us on

Spirit: సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా స్పిరిట్ ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభాస్ రీసెంట్ గా సలార్ సినిమాతో సక్సెస్ సాధించగా, సందీప్ రెడ్డి వంగ అనిమల్ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు.

ఇక ఇలాంటి టైమ్ లో ఈ సినిమా మీద పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలైతే ఏర్పడుతున్నాయి. ఇక ఈ సినిమా ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పుడు అందుకున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగ కొన్ని హాలీవుడ్ సినిమాలని మిక్స్ చేసి ఈ సినిమా స్టోరీ రాసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే స్టోరీలను తెలుగు నేటి వీటికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను తీయబోతున్నట్టు గా వార్తలు కూడా వస్తున్నాయి.

మరి వీటిలో ఎంత మాత్రం నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. అయితే కొంతమంది సందీప్ అభిమానులు మాత్రం సందీప్ కి రీమేక్ లను ఎంకరేజ్ చేయడు తన సొంత స్క్రిప్ట్ తోనే వెళ్తాడు, ఎవరిని కాపీ చేయాల్సిన అవసరం తనకు లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం రాజమౌళి లాంటి డైరెక్టరే కొన్ని సీన్లు కాపీ చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ కాపీ చేయడం లేదు అంటే ఎలా నమ్మడం అంటూ కొంత మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సందీప్ ప్రభాస్ ని నెక్స్ట్ లెవెల్ లో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రేక్షకుడి ఊహకు అందని విధంగా ప్రభాస్ ని ఒక భారీ రేంజ్ లో చూపిస్తాను అంటూ సందీప్ ఇప్పటికే ఈ సినిమాలో సీన్లను చాలా స్ట్రాంగ్ గా రాసుకుంటున్నట్టు గా తెలుస్తుంది. మరి ఈ సినిమా రిలీజ్ అయితే కానీ ఏమైనా సీన్లు కాపీ చేశాడా లేదా అనేది తెలుస్తుంది…