Prashant Varma
Prashant Varma : సినిమా ఇండస్ట్రీలో దర్శకులుగా రాణించాలి అంటే అంత ఆషామాషి వ్యవహరమైతే కాదు. ఒక సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టినంత మాత్రాన చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో దర్శకులుగా కొనసాగుతారు అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఇక దర్శకుడు ఎప్పటికప్పుడు సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లాల్సిన అవసరమైతే ఉంది. అలా చేసినప్పుడే ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి క్రియేట్ అవుతుంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్ లహవా ఎక్కువగా కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంటున్నాడు. తను సినిమాలను మాత్రమే డైరెక్షన్ చేయకుండా ప్రశాంత్ యూనివర్స్ స్టార్ట్ చేసి అందులో తను ప్రొడ్యూసర్ గా మారుతూ తను కథలను అందిస్తూ ఆయన శిష్యులతో కొన్ని సినిమాలను డైరెక్షన్ చేయిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా చిన్న ఏజ్ లోనే చాలా గొప్ప సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ డైరెక్టర్ ఫ్యూచర్లో మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతాడని అందరు అనుకున్నారు. అయితే బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను కూడా బాలయ్య ప్రశాంత్ కే అప్పచెప్పాడు. అయితే ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఎక్కువగా డబ్బులు ఏరకంగా వస్తున్నాయో దానిని అనుసరించే తను బిజినెస్ స్ట్రాటజీ ని మెయింటైన్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు… ఇక దానికోసమే ప్రస్తుతం ఆయన చేతిలో దాదాపు నాలుగు నుంచి ఐదు సినిమాల వరకు ఉన్నాయి. అయితే జై హనుమాన్ సినిమాని అనౌన్స్ చేసిన ఆయన తొందలోనే ఆ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్ళే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దాంతో పాటుగా మోక్షజ్ఞ సినిమాని కూడా లైన్ లో పెట్టాడు. మరి ఈ సినిమాతో కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని అనుకున్నాడు.
కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్ ‘ అనే సినిమాని చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరి బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అడగగా ఆ సినిమాని తన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న ఒక కుర్రాడుతో చేయిస్తానని చెప్పారట.
దాంతో సీరియస్ అయినా బాలయ్య ప్రశాంత్ వర్మ కాంపౌండ్ నుంచి బయటికి రావాలని చేస్తున్నాడట…ప్రశాంత్ తన కొడుకు కెరియర్ ను రిస్క్ లో పెట్టాలని చూస్తున్నాడని బాలయ్య తీవ్రమైన కోపానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ వర్మ చేజేతులారా తన కెరియర్ ను తనే నాశనం చేసుకుంటున్నాడనే చెప్పాలి…
ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు ఎంతో నమ్మకంగా తన కొడుకుని పరిచయం చేయమని గొప్ప బాధ్యతను అప్పగించినప్పటికి ప్రశాంత్ మధ్యలో ఇలాంటి సైడ్ బిజినెస్ చేసుకుంటూ మోక్షజ్ఞ కెరియర్ ను రిస్క్ లో పెట్టడం కరెక్ట్ కాదని ట్రెడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…