OG Trailer: మరో నాలుగు రోజుల్లో ఓజీ(They Call Him OG) చిత్రం విడుదల కాబోతుంది. కానీ ఇప్పటి వరకు ఫైనల్ కంటెంట్ రెడీ అవ్వలేదు, పని చేస్తూనే ఉన్నారు. మరో పక్క థియేట్రికల్ ట్రైలర్ ని ఈరోజు ఉదయం పది గంటలకు విడుదల చేస్తామని చెప్పారు. కానీ దానిని కూడా నేడు సాయంత్రం గచ్చిబౌలి స్టేడియం లో జరగబోయే ‘ఓజీ మ్యూజిక్ కన్సర్ట్’ లో విడుదల చేస్తామని మేకర్స్ కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేశారు. దీనికి ఫ్యాన్స్ పిచ్చి కోపం తో ఉన్నారు. కనీసం ఈరోజైన విడుదల అవుతుందా, లేకపోతే రేపు చేస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మేకర్స్ ప్లానింగ్ అలా ఉంది అన్నమాట. అయితే ఈ సినిమా నుండి తక్కువ కంటెంట్ బయటకు రావడం వల్లే ఇంత క్రేజ్ ఏర్పడిందా అనే కోణం లో కూడా ఆలోచిస్తున్నారు విశ్లేషకులు.
ఎప్పుడో రెండేళ్ల క్రితం విడుదల చేసిన గ్లింప్స్ వీడియో, రీసెంట్ గా విడుదల చేసిన ఫైర్ స్ట్రోమ్ మరియు గన్స్ & రోజెస్ పాటలు తప్ప ఈ సినిమా నుండి కంటెంట్ పెద్దగా ఏమి రాలేదు. ఇలా ఎక్కువ కంటెంట్ బయటకు చూపించకుండా ఉండడం వల్లే ఈ రేంజ్ క్రేజ్ ఏర్పడింది అని అంటున్నారు. ఎందుకంటే తక్కువ కంటెంట్ వదలడం వల్ల సినిమాలో ఏముందో తెలుసుకోవాలనే ఆత్రుత ప్రతీ ఒక్కరిలోనూ కలుగుతుంది. గ్లింప్స్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే గ్లింప్స్ ని అభిమానులు చూస్తున్నారే తప్ప, మరో పెద్ద కంటెంట్ ఈ చిత్రం నుండి రాలేదు. అయినప్పటికీ కూడా ఓవర్సీస్ లో ఆ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్, హైదరాబాద్ లో ఆల్ టైం రికార్డు దిశగా సినిమా వెళ్తుండడం కేవలం పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ కి నిదర్శనం అని చెప్పొచ్చు.
అయితే ట్రైలర్ కట్ మాత్రం గ్లింప్స్ వీడియో ఇచ్చిన హై కంటే పది రెట్లు ఎక్కువ ఉంటుందట. ఆ రేంజ్ లో ప్లాన్ చేసాడట డైరెక్టర్ సుజీత్. పవన్ కళ్యాణ్ నుండి ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబందించిన డైలాగ్స్ బయటకు రాలేదు. గ్లింప్స్ లో మరాఠి లో డైలాగ్ కొడుతాడు కానీ, తెలుగు లో పవర్ ఫుల్ డైలాగ్ ఇప్పటి వరకు రాలేదు. దానికి తోడు రీసెంట్ గానే ‘#WashiYoWashi’ అంటూ జపాన్ లో ఒక మోనోలాగ్ డైలాగ్ కొట్టాడు పవన్ కళ్యాణ్. ఇది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దీనిని అనువదించి అర్థం తెలుసుకున్న తర్వాత ఫ్యాన్స్ మెంటలెక్కిపోతున్నారు. ఆ రేంజ్ లో ఉంది. సినిమాలో ఇలాంటివి చాలానే ఉన్నాయట, చూడాలి మరి.