Manchu Vishnu: మంచు విష్ణు ‘మా’ ప్రెసిడెంట్ అయ్యాక, భవనం గురించి కాస్త తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ‘మా’ సంఘానికి చిరకాలంగా వున్న భవన సమస్యకు తాను పరిష్కారం చూపిస్తాను అంటూ చెప్పుకొచ్చిన మంచు విష్ణు ఇంకా భవనం పై ఎలాంటి అప్ డేట్ ఎందుకు ఇవ్వట్లేదు ? అంటూ మా సంఘంలో మిగిలిన సభ్యులు గుసగుసలాడుతున్నారు.

‘మా’ సంఘానికి కట్టబోయే భవనం ఖర్చు మొత్తాన్ని తమ కుటుంబమే భరిస్తుందని మంచు విష్ణు సగర్వంగా ప్రకటించాడు. పైగా భవనం నిర్మాణం కోసం స్థలాలు కూడా చూశానని విష్ణు చెప్పుకొచ్చాడు. మరి ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయి ? వాటిల్లో దేన్ని ఫైనల్ చేశారు ? అంటూ కామెంట్స్ చేసున్నారు ఆపోజిట్ ప్యానెల్ సభ్యులు.
నిజానికి మొదట విష్ణు భవన నిర్మాణ వ్యయంలో పాతిక శాతం ఖర్చు మాత్రమే భరిస్తానని మాట ఇచ్చాడు. అయితే ఆ తర్వాత ప్రకాష్ రాజ్ తో పోటీ తారాస్థాయికి చేరడం.. ఆ కోపంలో మా భవనం నిర్మాణానికి మొత్తం ఖర్చు తామే భరిస్తామని ఓ వీడీయో రిలీజ్ చేశాడు. అప్పుడంటే ఆవేశంలో చేశాడు. మరి ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకునే పరిస్థితి ఉందా ?
Also Read: కంటెంట్ ఉన్నోడికి పంచ్ తో పని ఏమిటి ?
మా భవనం అంటే.. చిన్న ఇంటి నిర్మాణం టైపు కాదు. అదొక భారీ కట్టడం. తెలుగు సినిమా పెద్దలు అంతా కూర్చుని అందరూ కలిసి కట్టుగా నిర్మిస్తేనే అవ్వని భవనం అది. అలాంటిది ఫామ్ లో లేని హీరో ఒక్కడే కట్టేయడం జరిగే పని కాదు. ఇప్పటికైతే ఇంకా ఇచ్చిన మాటకు కట్టుబడ్డాను అంటూ చెబుతున్నాడు. మరి విష్ణు చివరకు ఏమి చేస్తాడో చూడాలి.
Also Read: Kareena Kapoor: ప్చ్.. కరీనా కూడా చాలా కష్టాలు చూసిందట !