Koratala Siva- NTR: #RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ సినిమా అప్పుడే ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ఒక రైల్వే స్టేషన్ సెట్ లో ఎన్టీఆర్ మరియు సైఫ్ అలీ ఖాన్ మధ్య ఒక భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించారు, అక్కడితో మొదటి షెడ్యూల్ మొత్తం పూర్తి అయ్యింది.
ఇప్పుడు రెండవ షెడ్యూల్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఇలా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమాని చూసి ఫ్యాన్స్ సంతోషం గానే ఫీల్ అవుతున్నారు. కానీ రీసెంట్ గా ఈ మూవీ కి ఎంపికైన నటీనటులను చూస్తూ ఉంటే అసలు కొరటాల శివ సినిమాని తీస్తున్నాడా, లేదా సీరియల్ తీస్తున్నాడా అనే అనుమానం కలుగుతుంది.
ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ కి భార్య గా ప్రముఖ సీరియల్ హీరోయిన్ చైత్ర ని తీసుకున్నాడు కొరటాల శివ. అలాగే హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్ కి తల్లిగా ప్రముఖ సీరియల్ ఆర్టిస్ట్ మణిచందన ని తీసుకున్నాడు. ఈమె ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్, కానీ ఇప్పుడు సీరియల్స్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా చేస్తుంది.
భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాలలో ఎవరైనా సపోర్టింగ్ కాస్ట్ కి పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఫేమ్ ఉన్న ఆర్టిస్టులను ఎంచుకుంటారు, కానీ కొరటాల శివ అలాంటివి వారికి బదులుగా సీరియల్ ఆర్టిస్టులను ఎంచుకోవడం లో ఆయన అంతర్యం ఏమిటి..?, బడ్జెట్ మిగిలించాలని అనుకుంటున్నాడా..!, ఇలాగే ముందుకు పోతే క్వాలిటీ విషయం లో రాజీ పడే అవకాశం కూడా ఉంది, అందుకే అభిమానులు అంతలా భయపడుతున్నారు. మరి కొరటాల శివ ఫ్యాన్స్ ని ఎలా సంతృప్తి పరుస్తాడో చూడాలి.