బాలీవుడ్ స్టార్ హీరోల్లోనే మిస్టర్ పర్ ఫెక్ట్ అనే బిరుదు ఉన్న ఏకైక హీరో ‘అమీర్ ఖాన్’ (Aamir Khan). కానీ ఇప్పుడు ఆయన అభిమానులే ఆయనను మిస్టర్ పర్‌ఫెక్ట్ అని పొగడటానికి ఆలోచిస్తున్నారు. తన రెండో భార్య కిరణ్ రావ్ కి అమీర్ విడాకులు ఇచ్చిన దగ్గర నుండి అమీర్ పై నెటిజన్ల తో పాటు ఫ్యాన్స్ కూడా సీరియస్ గానే ఉన్నారు. ‘నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్ కాదు, మిస్ యూజ్ చేయడంలో ఎక్స్ పెక్ట్ వి అంటూ అమీర్ ను బాగా ట్రోల్ చేశారు.
ఈ నేపథ్యంలోనే అమీర్ – కిరణ్ విడాకులకు అసలు కారణం హీరోయిన్ ‘ఫాతిమా సనా షేక్’ (Fatima Sana Shaikh) అంటూ ఒక పుకారు బాగా షికారు చేసింది. ఫాతిమాతో అమీర్ కి ఎఫైర్ ఉందని ఆరోపణలు చేస్తూ రికార్డు స్థాయిలో ఆమె పేరు హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్లు చేస్తూ నెటిజన్లు ఫాతిమా పై తమ అక్కసును వెళ్లగక్కుతూ ఆమెను తీవ్రంగా దూషించారు. ఇప్పుడు తాజాగా అమీర్ ఖాన్ తో ఫాతిమాకు పెళ్లి ఫిక్స్ అయిందని ఓ రూమర్ మళ్ళీ పుట్టుకొచ్చింది.
29 ఏళ్ల ఫాతిమాతో 56 ఏళ్ల అమీర్ కి పెళ్లి ఏమిటి ? ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం ఉన్నా.. అమీర్ పై నెగిటివ్ కామెంట్స్ తో విరుచుకుపడటానికి నెటిజన్లు రెడీగా ఉన్నారు. ఏది ఏమైనా ఈ వార్త పై ఇప్పటికే సెటైర్లు, ట్రోలింగ్ జరిగింది. మరోపక్క ఈ వార్తలో వాస్తవం ఉందా అని ఆరా తీస్తే.. నిప్పు లేనిదే పొగ రాదు కదా అనే సామెత గుర్తుకొస్తుంది.
అమీర్ తో అనుబంధం పై ఫాతిమా రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘అసలు నా పర్సనల్ విషయాల గురించి రాయడానికి మీడియాకి ఏమి హక్కు ఉంది ?, నా పై ఇలా పుకార్లు వ్యాప్తి చేస్తూ నన్ను తిట్టించడం సరికాదు అంటూ కామెంట్స్ చేసింది తప్ప, వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఫాతిమా క్లారిటీ ఇవ్వలేదు. అలాగే కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా ఖండించలేదు.
అంటే.. ఫాతిమాతో అమీర్ కు సంబంధం అంటగట్టడం విషయంలో ఎక్కడో నిజం ఉన్నట్టే కదా ? అంటూ యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోయి వీరిద్దరిని ట్రోల్ చేశారు. ఇప్పుడు అమీర్, ఫాతిమాతో పెళ్ళికి రెడీ అయితే, ఇంకా ఎక్కువ ట్రోలింగ్ కి గురి కావాల్సి వస్తోంది.