Sreeleela: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భగవంత్ కేసరి సినిమా రీసెంట్ గా విడుదల అయింది. అంతే కాదు థియేటర్లను షేక్ చేస్తోంది ఈ సినిమా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తే.. కూతురు పాత్రలో శ్రీలీల నటించింది. మంచి స్టార్ డమ్ ఉన్న శ్రీలీల ఈ సినిమాలో కూతురు పాత్రలో నటించడంతో ఎంతో మంది షాక్ అయ్యారు. కానీ ఈమెకు బాలయ్య సినిమాలో కూడా అవకాశం వచ్చిందంటే స్టార్ స్టేటస్ వచ్చినట్టే అని ఆనంద పడ్డారు. పెళ్లి సందడి సినిమా నుంచి సడన్ గా బాలయ్య సినిమా వరకు తన ప్రయణాన్ని చూసి ఆశ్చర్యపోయారు కూడా. ఇక టాప్ హీరోయిన్ లలో ఒకరిగా దూసుకొని పోతున్న శ్రీలీల కూతురు పాత్రలో నటించడం కరెక్టేనా? కాదా? అనే అనుమానం ఎందరిలోనో వస్తుందట.
ఈ సినిమాలో శ్రీలీల ఆర్మీ కోసం ట్రైనింగ్ కి తీసుకుంటుంది. అలా ఆర్మీ ట్రైనింగ్ కోసం చాలా కష్టపడుతుందట. ఈ పాత్రకు కూడా పూర్తి న్యాయం చేసింది ఈ అమ్మడు. ఆమె నటనకు స్కోప్ దొరికింది కానీ.. హీరోయిన్ గా మెప్పించడానికి, డాన్స్ తో మెస్మరైజ్ చేయడానికి పెద్దగా స్కోప్ లేదనే చెప్పాలి. అయినా హీరోయిన్ ఉండగా శ్రీలీల పాత్రకు ఎక్కువ స్కోప్ ఇవ్వలేరు. అందుకే ఈ సినిమాలో కూడా దర్శకుడు అదే పని చేశారు. కానీ శ్రీ లీల అభిమానులు మాత్రం భగవంత్ కేసరి సినిమా లో శ్రీలీల మంచి పాత్రను పోషించింది కానీ… హీరోయిన్ గా నటిస్తే మరింత బాగుండు అని పెదవి విరుస్తున్నారు.
స్టార్ డం సంపాదించిన శ్రీలీల ఇలాంటి పాత్రను ఎందుకు ఒప్పుకుంది.. ఏదో చైల్డ్ ఆర్టిస్ట్ లాగా కనిపిస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. భగవంత్ కేసరి సినిమా లో మానసిక పరిస్థితి సరిగా లేని పాత్ర లో శ్రీ లీల నటించడం అభినందనీయం… కానీ ఒక వైపు స్టార్ హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో ఇలాంటి పాత్ర లు చేయడం సరి కాదు అనేది చాలా మంది అభిప్రాయం. మొత్తం మీద ఈ సినిమా శ్రీలీల కెరీర్ కి ప్లస్ కాదు. అలా అని మైనస్ కూడా కాదు అనేది టాక్. మరి చూడాలి ఈ సినిమా తర్వాత అమ్మడుకు వచ్చే అవకాశాలను బట్టి ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపించిందో తెలుస్తోంది.