Manchu Vishnu: జగన్ కుటుంబంతో బంధుత్వం కలిశాక, ముఖ్యంగా జగన్ అధికారంలోకి వచ్చాక మంచు విష్ణులో సగటు రాజకీయ నాయకుడు తొంగి చూస్తున్నాడు. ఇప్పటికే విష్ణు బిజినెస్ ల పరంగా వెరీ సక్సెస్ ఫుల్. హీరోగా ఆశించిన స్థాయిలో ఎదగలేక పోయినా.. రాజకీయంగా మాత్రం బాగా తెలివి మీరాడు. మరో రెండు రోజుల్లో ‘మా’ ఎన్నికలు హోరాహోరీగా జరగబోతున్నాయి. ఎలాగూ రెండు వర్గాలు సంస్థాగతంగానే కాకుండా వ్యక్తిగత దూషణలకు కూడా దిగి తమ స్థాయిని సంపూర్ణంగా దిగజార్చుకున్నారు.

సరే రెండు రోజుల్లో మా ఎన్నికల వ్యవహారం పై ఎవరి రాజకీయం ఫలించిందో తేలనుంది. అయితే, రసవత్తరంగా మారన మా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ? ఏ ప్యానల్ గెలుస్తోందా ? అని సినిమా వాళ్ళు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రకాష్ రాజ్, విష్ణు మ్యానిఫెస్టోల ప్రకటనలు చూస్తే.. రెగ్యులర్ ఎలక్షన్స్ కి నిజమైన రాజకీయ నాయకులు కూడా ఈ రేంజ్ లో వరాలు కురిపించరు.
రాజకీయ పార్టీల హామీల స్థాయిలో మంచు విష్ణు తన ప్యానెల్ కు సంబంధించి మ్యానిఫెస్టో ప్రకటించారు. మరి ఈ మ్యానిఫెస్టో ప్రకారం విష్ణు నిజంగానే పనులు చేస్తాడా ? ఇంతకీ మ్యానిఫెస్టోలో వరాల విషయానికి వస్తే..
మా సభ్యులందరికి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ .. ఈ హామీ బాగుంది. మా సభ్యులకి గవర్నమెంట్ సహకారంతో శాశ్వత ఇల్లు.. ఈ హామీ తీర్చడం ప్రభుత్వాల వల్లే కావడం లేదు. మరి విష్ణు వల్ల అవుతుందా ? ఇక మూడు నెలలకి ఒకసారి మా సభ్యులకి మెడికల్ క్యాంప్ నిర్వహణ, ఇది చెయ్యొచ్చు. మా సభ్యులందరూ గర్వపడేలా సొంత డబ్బుతో మా భవన నిర్మాణం, ఇది కూడా సాధ్యమే.
ఇక విష్ణు హామీల్లో చేయగలిగేలా ఉన్నవి, మా సభ్యత్వం ఉన్నవారి కోసం ప్రత్యేక యాప్, జాబ్ కమిటీ ఏర్పాటు చేసి సినిమా, ఓటిటి అవకాశాలు కల్పించడం, అలాగే మా ఫండ్ రైజింగ్ కోసం కల్చరల్ అండ్ ఫైనాన్స్ కమిటీ ఏర్పాటు చేయడం, రెండు రాష్ట్రాల సీఎంలను కలిసి ఇండస్ట్రీ సమస్యలను తీర్చేందుకు కృషి, అర్హులైన కళాకారులకి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయడం, ఇవ్వన్నీ చేయవచ్చు.
అయితే, మా లో అర్హులైన వారి పిల్లలకి కేజీ టు పిజి ఉచిత విద్య.. ఈ హామీ సాధ్యమేనా ? అలాగే మోహన్ బాబు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం.. ప్రస్తుతం ఇన్స్టిట్యూట్ ల పరిస్థితే బాగాలేదు. మరి మోహన్ బాబు ఇన్ స్టిట్యూట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది ? ఏది ఏమైనా ఈ హామీలను, ఓట్లర్ల కోరికలు తీర్చడం విష్ణుకు సాధ్యమేనా ?