Oke Okkadu Movie: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో పలు సినిమాలు భాష తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపుతుంటాయి. సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ 20 ఏళ్ళ క్రితమే పాన్ ఇండియా రేంజ్ లో తన దర్శకత్వ ప్రతిభ తో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బద్దలు కొట్టాడు. ఆయన దర్శకత్వం లో అప్పట్లో వచ్చిన ‘ఒకే ఒక్కడు’ అనే చిత్రం ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.
యాక్షన్ కింగ్ అర్జున్ కెరీర్ లో ఈ చిత్రం ఒక మైలు రాయిగా నిలిచిపోయింది. అటు తమిళం లో ఇటు తెలుగు బాక్స్ ఆఫీస్ పరంగా అప్పట్లోనే 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టింది అంటే ఇది ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు.కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ సినిమాకి 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట, గ్రాస్ లెక్కలు తీస్తే ఆరోజుల్లోనే ఈ సినిమాకి 60 కోట్ల గ్రాస్ వచ్చిందట.
ఇలాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని తమిళం లో అర్జున్ తో తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి తో సమాంతరం గా చెయ్యాలనే ఆలోచనలో ఉండేవాడట అప్పట్లో శంకర్. మెగాస్టార్ చిరంజీవి ని ఈ విషయం పై సంప్రదింపులు కూడా జరిపాడట. కానీ శంకర్ ఒకేఒక్కడు చిత్రాన్ని తెరకెక్కించే టైం లో చిరంజీవి డేట్స్ ఖాళీ లేవు.దాంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ చిరంజీవి చేతుల్లో నుండి మిస్ అయ్యింది.
ఒకవేళ మెగాస్టార్ ఒప్పుకొని ఈ చిత్రం చేసి ఉంటే కనీసం పదేళ్ల పాటు టాలీవుడ్ లో మరో హీరో ఈ సినిమా కలెక్షన్స్ దరిదాపుల్లో కూడా వెళ్ళేవాళ్ళు కాదని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట.అయితే ఇదే సినిమాని హిందీ లో అనిల్ కపూర్ ని పెట్టి రీమేక్ చేసాడు శంకర్, కానీ అక్కడి ఆడియన్స్ కి ఈ చిత్రం నచ్చలేదు, ఫలితంగా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.