Raja Saab movie: బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించిన హీరో ప్రభాస్…ఆయన ఫ్లాప్ సినిమాలకు సైతం ఇండియాలో భారీ కలెక్షన్స్ వస్తున్నాయి… ఇక ఇంతకుముందు ఆయన చేసిన సలార్, కల్కి లాంటి సినిమాలు ఇండియా వైడ్ గా మంచి విజయాలను దక్కించుకొని టాప్ కలెక్షన్స్ ను కొల్లగొట్టాయి. ఇక ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో ఆయన చేసిన ‘రాజాసాబ్’ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఇక ఈ మూవీని ప్రభాస్ ఒప్పుకున్నప్పుడు అతని ఫాన్స్ జీర్ణించుకోలేకపోయారు. కారణం ఏంటి అంటే ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు ప్రభాస్ తో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నప్పటికి ఆయన మాత్రం మారుతి లాంటి ఒక మీడియం రేంజ్ డైరెక్టర్ తో సినిమా చేయడం ఏంటి అనే ఒక అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్ వచ్చిన తర్వాత మారుతి సైతం ప్రభాస్ ని ఏదో కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ కొంతవరకు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
కానీ ఈరోజు రిలీజ్ అయిన సినిమాను చూస్తే మాత్రం సినిమాలో పెద్దగా మ్యాటర్ ఏమీ లేదని ప్రభాస్ ని మినహాయిస్తే ఆ సినిమాలో హైలెట్ పెయింట్స్ లేవని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఫ్యాన్స్ ఇలాంటి కామెంట్లను వ్యక్తం చేస్తునే ప్రభాస్ అంటే అమితమైన ఇష్టం ఉంది కాబట్టే వాళ్ళు ఒకటికి రెండుసార్లు సినిమాని చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
కానీ సగటు ప్రేక్షకులు మాత్రం సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ అయితే పెట్టడం లేదు…ఇక ఇదిలా ఉంటే మారుతి మొదట ఈ సినిమాని వేరే హీరోతో చేయాలనుకున్నాడట. కానీ ప్రభాస్ డేట్స్ ఇవ్వడంతో ప్రభాస్ కి కథనైతే వినిపించాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. కాబట్టి ముందుగా మారుతి అనుకున్న హీరో మూవీ నుంచి తప్పించుకున్నాడు అంటూ కొంతమంది కొన్ని అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి మారుతి మొదట ఈ సినిమాను ఎవరితో చేయాలనుకున్నాడు అంటే తమిళ స్టార్ హీరో సూర్యతో చేయాలనుకున్నాడట. కానీ సూర్యకి ఈ కథనైతే వినిపించలేదు. ఒకవేళ అతను ఈ కథ వింటే ఓకే చేసేవాడా? లేదా రిజెక్ట్ చేసేవాడా అనే విషయం కూడా తెలియదు కానీ మొత్తానికైతే మారుతి ప్రభాస్ తో ఈ సినిమా చేసి అతని ఇమేజ్ ను తగ్గించాడనే చెప్పాలి…