Sandeep Reddy Vanga : సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు స్టార్ డమ్ ను సంపాదించుకునే ఉద్దేశ్యం తో ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ లాంటి నటుడు భారీ సక్సెస్ లను సాధిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇలాంటి దర్శకుడు ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నాడనే చెప్పాలి… ఇక ప్రస్తుతం ఉన్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగకి చాలా మంచి గుర్తింపైతే ఉంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఆయన గత సంవత్సరం చేసిన అనిమల్ సినిమా దాదాపు 900 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగ ను స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టింది. మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న ప్రతి ప్రయత్నం సినిమా ఇండస్ట్రలో సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఆయనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహిస్తూ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. మరి ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎలా కనిపించబోతున్నాడనే దానిమీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇక సందీప్ రెడ్డివంగ సినిమాల్లో హీరోలు చాలా వైల్డ్ గా కనిపిస్తూ ఉంటారు. అలాగే బోల్డ్ సినిమాలను చేస్తాడు అనే ఒక ముద్ర అయితే అతని మీద ఉంది. మరి స్పిరిట్ సినిమాతో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో చూపిస్తానని చెబుతున్న సందీప్ రెడ్డి వంగ…
ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాలో ఒక ఆర్మీ ఆఫీసర్ ఎలా ఉంటాడో చూపిస్తానని చెబుతున్నట్టుగా తెలుస్తోంది. మరి బ్యాక్ టు బ్యాక్ సందీప్ రెడ్డి వంగా పోలీస్ ఆర్మీ కథలను ఎంచుకోవడం వెనుక కారణమేంటి ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుంది.
తద్వారా అల్లు అర్జున్ కి ఎలాంటి క్రేజ్ ని తీసుకొచ్చి పెడుతుందనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.
ఇక సందీప్ రెడ్డి వంగ కి బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉండడంతో అక్కడ ఆయనకి ఎక్కువ డిమాండ్ అయితే ఉంది. ఇక తెలుగులో కూడా ఆయన సినిమాలు అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఉన్నారు. కాబట్టి ఈ సినిమాలకి మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…